(1 / 6)
ఏపీ ప్రభుత్వం మద్యంపై సర్వే చేపట్టింది. లిక్కర్ క్వాలిటీ, ధరల ఉల్లంఘనలపై అభిప్రాయాలు స్వీకరిస్తోంది. గతంలో ఐవీఆర్‌ఎస్ కాల్స్, వాట్సాప్ ద్వారా సమాచారం సేకరించింది. ఇప్పుడు నేరుగా బార్లు, మద్యం షాపుల వద్ద అభిప్రాయాలు వెల్లడించే క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేసింది.
(unsplash)(2 / 6)
ప్రతి బార్, షాపులో కౌంటర్, మద్యం తాగే ప్రదేశం, బయట గోడలపైనా 4 నుంచి 5 చోట్ల క్యూఆర్ కోడ్‌లను ఎక్సైజ్ సిబ్బంది అతికించారు. మందుబాబులు ఎప్పుడైనా ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి.. అందులో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పవచ్చు. తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. వాటి ఆధారంగా మద్యం నాణ్యత, ధరలు, సిబ్బంది ప్రవర్తన వంటి అంశాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.
(unsplash)(3 / 6)
ఈ సర్వేలో వైన్ షాపులకు 5, బార్లకు 3 ప్రశ్నలు అడుగుతున్నారు. వాటి కింద అవును, కాదు అనే ఆప్షన్లు ఉంటాయి. వాటిని ఎంపిక చేసిన తర్వాత పేరు, మొబైల్ నంబరు, నియోజకవర్గం, జెండర్, పుట్టిన తేదీ సమర్పించి అభిప్రాయాలను తెలియజేయవచ్చు. గతంలో ఐవీఆర్‌ఎస్ కాల్స్, వాట్సాప్ ద్వారా చేసిన సర్వేలో మద్యంపై సానుకూల అభిప్రాయాలే వ్యక్తమయ్యాయి.
(unsplash)(4 / 6)
ప్రశ్నలు ఇలా ఉన్నాయి. గతంతో పోలిస్తే మద్యం నాణ్యత పెరిగిందా? పాపులర్ మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయా? ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీలో మద్యం ధరలు తగ్గాయా? మీ ప్రాంతంలోని దుకాణాలలో ఎమ్మార్పీ ఉల్లంఘనలు గమనించారా? వైన్ షాపు సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది? అనే ప్రశ్నలు ఉంటాయి. బార్‌ల విషయంలో ధరలు, ఎమ్మార్పీ ఉల్లంఘనల ప్రశ్నలు ఉండవు.
(unsplash)(5 / 6)
అయితే.. క్యూఆర్ కోడ్ సర్వేలో వివరాలు అడగటం సరికాదనే వాదన బలంగా వినిపిస్తోంది. వినియోగదారుల వ్యక్తిగత వివరాల్లో ఫోన్ నంబరు తప్పనిసరిగా సమర్పించాలి. మద్యం విషయంలో చేసే సర్వేలో నియోజకవర్గంతో సహా వ్యక్తిగత విషయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో తమకు ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయేమోనని మందుబాబులు భావిస్తున్నారు.
(unsplash)(6 / 6)
మద్యంపై చేపడుతున్న సర్వే విషయంలో కొత్త ప్రశ్నలు వస్తున్నాయి. సాధారణంగా అంతా బాగుంటే వినియోగదారులు సర్వేలో పాల్గొనరు. ఏవైనా ఫిర్యాదులు ఉన్నప్పుడే స్పందిస్తారు. సర్వేలోని ప్రశ్నల్లో ధరలు, నాణ్యత, బ్రాండ్ల లభ్యత అనేవి ప్రభుత్వ స్థాయిలో ఉంటాయి. దానిపై ఫిర్యాదులు వస్తే ఆ సమస్యను ప్రభుత్వమే పరిష్కరించాలి. కానీ, సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది? షాపుల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలు ఉన్నాయా? అనేవి ఆయా బార్లు, షాపులపై ఆధారపడి ఉంటాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
(unsplash)ఇతర గ్యాలరీలు