Google Pixel 9a: గూగుల్ పిక్సెల్ 9ఏ స్మార్ట్ ఫోన్ లాంచ్ కు సిద్ధమైంది. స్పెసిఫికేషన్లపై ఓ లుక్కేయండి..
Google Pixel 9a: గూగుల్ తన కొత్త స్మార్ట్ ఫోన్ గూగుల్ పిక్సెల్ 9ఎను ఈ మార్చిలో లాంచ్ చేయనుంది.ఈ కొత్త ఫోన్ లోని ప్రత్యేక ఫీచర్లు, అడ్వాన్స్డ్ స్పెసిఫికేషన్లు, ఇతర వివరాలు ఇక్కడ ఉన్నాయి.
(1 / 5)
గూగుల్ పిక్సెల్ 9ఎ లాంచ్ సమయం దగ్గర పడుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ గురించి ఇంటర్నెట్ లో చాలా సమాచారం చక్కర్లు కొడుతోంది. గూగుల్ తన కొత్త స్మార్ట్ ఫోన్ తో ఏ ప్రత్యేక ఫీచర్లను తీసుకువచ్చే అవకాశముందో ఇక్కడ క్లుప్తంగా చూద్దాం.
(OnLeaks)(2 / 5)
గూగుల్ పిక్సెల్ 9ఎ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.3 అంగుళాల యాక్చువా డిస్ ప్లేతో రానుంది.ఈ స్మార్ట్ ఫోన్ పియోనీ, ఐరిస్, అబ్సిడియన్, పోర్స్లెయిన్ అనే నాలుగు రంగుల్లో లభించే అవకాశం ఉంది.
(Android Headline)(3 / 5)
గూగుల్ పిక్సెల్ 9ఎ టెన్సర్ జీ4 ప్రాసెసర్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్ తో పనిచేస్తుందని భావిస్తున్నారు. 8 జీబీ LPDDR5X ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ స్మార్ట్ఫోన్ వస్తుందని వార్తలు వస్తున్నాయి. కాబట్టి, పిక్సెల్ 9 మోడళ్ల మాదిరిగానే దీని నుంచి కూడా భారీ పనితీరును ఆశించవచ్చు. అదనంగా, గూగుల్ అధునాతన ఏఐ ఫీచర్లను కూడా చేర్చవచ్చు.
(Shaurya Sharma - HT Tech)(4 / 5)
గూగుల్ పిక్సెల్ 9ఎ డ్యూయల్ కెమెరా సెటప్ తో రావచ్చు. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 13 మెగాపిక్సెల్ కెమెరా ఉండే అవకాశం ఉంది. అయితే, ఫ్రంట్ కెమెరా గురించి వివరాలు ఇంకా తెలియరాలేదు. పిక్సెల్ 9ఎలో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుందని చెబుతారు. ఇది 23వాట్ వైర్డ్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.
(Shaurya Sharma - HT Tech)ఇతర గ్యాలరీలు