TG Ration Cards : సన్నబియ్యంతో పాటు సబ్సిడీపై గోధుమలు! రేషన్ కార్డుదారులకు తెలంగాణ సర్కార్ శుభవార్త, తాజా నిర్ణయాలివే
- తెలంగాణవ్యాప్తంగా జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేయన్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేశారు. సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో మాట్లాడిన మంత్రి…. రేషన్ దుకాణాలలో సబ్సిడీ ధరలకే గోధుమలు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు.

(1 / 6)
రేషన్ కార్డు దారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేయనుంది.
(2 / 6)
గురువారం సచివాలయంలో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…. రేషన్ దుకాణాలలో సబ్సిడీ ధరలకే గోధుమలు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు.
(3 / 6)
నాణ్యమైన బియ్యాన్ని వినియోగదారులకు అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అన్ని ఉత్తమ్ పేర్కొన్నారు. అవసరమైన చోట సబ్సిడీ ధరలకు గోధుమలను సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.
(4 / 6)
రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని… ఈ విషయంలో రేషన్ డీలర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీలర్ల సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీనిచ్చారు.
(5 / 6)
పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ దిశానిర్దేశం చేశారు.
ఇతర గ్యాలరీలు