(1 / 5)
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో రిలీజైంది. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది. ఈ యాక్షన్ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద జోరు చూపింది.
(2 / 5)
గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. రేపే (మే 8) ఈ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అడుగుపెట్టనుంది. థియేటర్లలో రిలీజైన నెలలోగానే స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇస్తోంది.
(3 / 5)
గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రేపు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు వస్తుంది. ఐదు భాషల్లో అందుబాటులో ఉంటుంది. స్ట్రీమింగ్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
(4 / 5)
గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఏకే అలియాజ్ రెడ్ డ్రాగన్ అనే గ్యాంగ్‍స్టర్ చుట్టూ ఈ సినిమా స్టోరీ సాగుతుంది. ఈ మూవీలో త్రిష హీరోయిన్‍గా నటించారు. అర్జున్ దాస్, ప్రభు, ప్రసన్న, సునీల్, జాకీ ష్రాఫ్ కీరోల్స్ చేశారు.
ఇతర గ్యాలరీలు