Gold Price In India : భారతదేశంలో బంగారం ధరను ఎవరు, ఎలా నిర్ణయిస్తారంటే?
Gold Price In India : భారతదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ. నిత్యం కోట్ల విలువైన బంగారం క్రయ విక్రయాలు జరుగుతుంది. ప్రతి రోజూ బంగారం ధరలు పెరిగాయి, తగ్గాయి అంటూ వార్తలు వస్తుంటాయి. మన దేశంలో బంగారం ధరలను ఎవరు నిర్ణయిస్తారు. ఎలా నిర్ణయిస్తారో తెలుసుకుందాం.మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 6)
భారతదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ. నిత్యం కోట్ల విలువైన బంగారం క్రయ విక్రయాలు జరుగుతుంది. ప్రతి రోజూ బంగారం ధరలు పెరిగాయి, తగ్గాయి అంటూ వార్తలు వస్తుంటాయి. మన దేశంలో బంగారం ధరలను ఎవరు నిర్ణయిస్తారు. ఎలా నిర్ణయిస్తారో తెలుసుకుందాం.
(Pixabay)(2 / 6)
ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) భారతదేశంలో బంగారం ధరను నిర్ణయించే ప్రధాన సంస్థ. ఐబీజేఏ దేశంలోని అతిపెద్ద బంగారు డీలర్లతో ఏర్పడిన సంస్థ. నిత్యం బంగారం ధరను నిర్ణయించడానికి ఐబీజేఏ వారితో కలిసి పనిచేస్తుంది.
(3 / 6)
బంగారం రేట్లను ఎలా నిర్ణయిస్తారంటే?
ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ దేశంలోని 10 అతిపెద్ద బంగారు డీలర్లతో మాట్లాడుతుంది. డీలర్ల బంగారం కొనుగోలు, అమ్మకం కోట్‌లను లెక్కిస్తుంది. స్థానిక పన్నులు, దిగుమతి సుంకాలు, కరెన్సీ హెచ్చుతగ్గులను పరిగణనలోకి తీసుకని బంగారం రేటును సర్దుబాటు చేస్తుంది. ఐబీజేఏ రోజువారీగా బంగారు రేట్లను ప్రకటిస్తుంది.
(4 / 6)
బంగారం ధరలను ప్రభావితం చేసే అంశాలివే
గోల్డ్ సప్లై-డిమాండ్, దిగుమతి రేట్లు, యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ, పెట్టుబడిదారుల ప్రవర్తన, బంగారం ఉత్పత్తి, బంగారం ఉత్పత్తికి అయ్యే ఖర్చు, వడ్డీ రేట్లు, దేశ ఆర్థిక పరిస్థితి
(5 / 6)
బంగారం ధరలను లెక్కించే ఫార్ములా
భారతదేశంలో బంగారం ధరను బంగారం స్వచ్ఛతను బట్టి రెండు విధాలుగా లెక్కించవచ్చు.
1.స్వచ్ఛత పద్ధతి (%) : బంగారం విలువ = (బంగారం రేటు x స్వచ్ఛత x బరువు) / 24
2.క్యారెట్ పద్ధతి : బంగారం విలువ = (బంగారం రేటు x స్వచ్ఛత x బరువు) / 100
(6 / 6)
భారతదేశంలో బంగారం ధరలు ఎక్కువగా అనధికారిక ప్రక్రియ ద్వారా నిర్ణయిస్తారు. డీలర్ల కొనుగోలు, అమ్మకం, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, దేశ ఆర్థిక పరిస్థితులు ఇలా అనేక అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతాయి. బంగారం ధరను 22 క్యారెట్లు/ గ్రా, 24 క్యారెట్లు/ గ్రా, 18 క్యారెట్లు/ గ్రా... లలో చెప్తారు.
ఇతర గ్యాలరీలు