(1 / 7)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ఉదయం 11 గం.ల సమయానికి 41.3 అడుగులకు నీటి మట్టం చేరింది. 43 అడుగులకి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు.
(2 / 7)
గోదావరిలో ఎగువన ప్రవాహం నామమాత్రంగా ఉన్నప్పటికీ.. కాళేశ్వరం వద్ద గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాత వరద ఉద్ధృతి పెరుగుతోంది. దీంతో పరిసర ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు.
(3 / 7)
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉదృతి వేగంగా పెరుగుతున్న నేపధ్యంలో జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అలా ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. సిబ్బంది కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలని అదేశించారు. 24 గంటలు పనిచేయు విదంగా కలెక్టరేట్ తో పాటు కొత్తగూడెం, భద్రాచలం ఆర్డిఓ కార్యాలయాలు అలాగే చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. భద్రాచలం వద్ద వరద ఈ రోజు సాయంత్రం వరకు మొదటి ప్రమాద హెచ్చరిక వరకు చేరే అవకాశం ఉన్నదని యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఏ ఒక్క ప్రాణానికి హాని కలుగ కుండా ప్రజలకు కానీ పశువులకు కానీ చేపట్టాల్సిన రక్షణ చర్యలపై ఎప్పటి కపుడు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.
(4 / 7)
కాళేశ్వరం దగ్గర గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. పుష్కరఘాట్ వద్ద 9.770 మీటర్ల ఎత్తులో ఈ రెండు నదులు ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ, లక్ష్మీ బ్యారేజ్ 57 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 4,85,030 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
(twitter)(5 / 7)
గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరదనీరు చేరుతుంది. కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 407 అడుగులు. కాగా… ప్రస్తుతం నీటి మట్టం 399.80 అడుగులుగా ఉంది.
(twitter)
(6 / 7)
కడెం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్తాయి నీటి మట్టం 700 అడుగులు కాగా, 690.500 అడుగులకు చేరింది. కడెం ప్రాజెక్టుకు 7,283 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఒక గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
(7 / 7)
హైదరాబాద్ వ్యాప్తంగా రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, బోరబండ, కూకట్‌పల్లి, మాదాపూర్, ఫిల్మ్ నగర తదితర ప్రాంతాల్లో వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. GHMC పరిధిలో సాయం కోసం 9000113667 నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
(twitter)ఇతర గ్యాలరీలు