Godari Gattu Song: వ్యూస్‍లో భారీ మైల్‍స్టోన్ దాటేసిన ‘గోదావరి గట్టు మీద’ పాట.. దూసుకెళుతున్న సాంగ్-godari gattu meeda song from sankranthiki vasthunam crosses 100 million views milestone on youtube ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Godari Gattu Song: వ్యూస్‍లో భారీ మైల్‍స్టోన్ దాటేసిన ‘గోదావరి గట్టు మీద’ పాట.. దూసుకెళుతున్న సాంగ్

Godari Gattu Song: వ్యూస్‍లో భారీ మైల్‍స్టోన్ దాటేసిన ‘గోదావరి గట్టు మీద’ పాట.. దూసుకెళుతున్న సాంగ్

Jan 15, 2025, 05:32 PM IST Chatakonda Krishna Prakash
Jan 15, 2025, 05:32 PM , IST

  • Godari Gattu Song - Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని ‘గోదారి గట్టు మీద’ పాట మోతమోగిపోతోంది. ఈ లిరికల్ సాంగ్ యూట్యూబ్‍లో తాజాగా ఓ భారీ మైల్‍స్టోన్ అధిగమించింది.

విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని ‘గోదారి గట్టు మీద’ పాట ఓ రేంజ్‍లో పాపులర్ అయింది. లిరికల్ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సాంగ్ మార్మోగుతోంది. ఈ పాట విపరీతంగా జనాల్లోకి వెళ్లిపోయింది. 

(1 / 5)

సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14వ తేదీన రిలీజ్ కాగా.. భారీ ఓపెనింగ్ దక్కించుకుంది. రిలీజ్‍కు ముందే ఈ చిత్రానికి అంత హైప్ వచ్చేందుకు గోదారి గట్టు పాట కూడా ఓ కారణంగా నిలిచింది. ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. తాజాగా యూట్యూబ్‍లో ఈ సాంగ్ లిరికల్ వీడియో.. వ్యూస్‍లో మైలురాయి అధిగమించింది. 

(2 / 5)

‘గోదారి గట్టు మీద’ పాట లిరికల్ వీడియో.. యూట్యూబ్‍లో 100 మిలియన్ వ్యూస్‍ను నేడు (జనవరి 15) దాటేసింది. ఈ లిరికల్ సాంగ్ యూట్యూబ్‍లో గత నెల డిసెంబర్ 3న రిలీజ్ అయింది. అప్పటి నుంచి మోతమోగుతూనే ఉంది. సుమారు 40 రోజుల్లోనే 100 మిలియన్ మార్క్ అధిగమించింది. 

(3 / 5)

గోదారి గట్టు పాట యూట్యూబ్‍లో 100 మిలియన్ (10 కోట్లు) వ్యూస్ దాటేసిందంటూ నేడు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఈ సినిమాకు భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించారు. ఈ సాంగ్‍కు అదిరిపోయే ట్యూన్ ఇచ్చారు. ఒకప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల పాడడం కూడా ఈ సాంగ్‍కు ప్లస్ అయింది. రమణ గోగులతో పాటు మధుప్రియ కూడా ఈ పాటను ఆలపించారు. ఈ సాంగ్‍కు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ ఇచ్చారు. 

(4 / 5)

సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తొలి రోజే రూ.45కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుందని మూవీ టీమ్ వెల్లడించింది. వెంకటేశ్‍కు ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్‍గా నిలిచింది. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు