IND vs AUS 5th Test: ఐదో టెస్టులో పింక్ క్యాప్‍లు ధరించనున్న ఆస్ట్రేలియా ప్లేయర్లు.. ఎందుకిలా?
- IND vs AUS 5th Test - Border Gavaskar Trophy: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు ఈ శుక్రవారం (జనవరి 3) మొదలుకానుంది. ఈ మ్యాచ్‍లో పింక్ కిట్ ధరించనున్నారు ఆసీస్ ఆటగాళ్లు. ఎందుకో ఇక్కడ తెలుసుకోండి.
- IND vs AUS 5th Test - Border Gavaskar Trophy: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు ఈ శుక్రవారం (జనవరి 3) మొదలుకానుంది. ఈ మ్యాచ్‍లో పింక్ కిట్ ధరించనున్నారు ఆసీస్ ఆటగాళ్లు. ఎందుకో ఇక్కడ తెలుసుకోండి.
(1 / 5)
టీమిండియాపై ఆస్ట్రేలియా నాలుగో టెస్టులో విజయం సాధించింది. మెల్‍బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‍లో గెలిచి ఐదు టెస్టుల సిరీస్‍లో 2-1తో ముందంజ వేసింది ఆసీస్. భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్‍లో చివరిదైన ఐదో టెస్టు సిడ్నీ వేదికగా శుక్రవారం (జనవరి 3) నుంచి జరగనుంది. రెండు జట్లకు ఈ ఏడాది 2025లో ఇదే మొదటి పోరు. ఈ మ్యాచ్‍లో ఆస్ట్రేలియా ప్లేయర్లు పింక్ క్యాప్స్ ధరించనున్నారు.
(2 / 5)
రొమ్ము క్యాన్సర్‌కు వ్యతిరేకంగా అవగాహన కల్పించడంలో భాగంగా ఈ ఐదో మ్యాచ్.. పింక్ టెస్టుగా జరగనుంది. క్యాన్సర్ నిర్మూలన కోసం ఆసీస్ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‍గ్రాత్ ఓ ఫౌండేషన్ స్థాపించారు. మెక్‍గ్రాత్ ఫౌండేషన్ తరఫున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇందుకు మద్దతుగా ఆస్ట్రేలియా పింక్ టెస్ట్ ఆడనుంది.
(3 / 5)
భారత్‍తో ఐదో టెస్టులో పింక్ క్యాప్‍లను ఆస్ట్రేలియా ఆటగాళ్లు ధరించనున్నారు. జెర్సీలపై లోగోలు కూడా పింక్ కలర్‌లో ఉండనున్నాయి. పింక్ కిట్‍లతో ఆసీస్ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. వీటితో ఓ నేడు ఫొటో షూట్ నిర్వహించారు.
(4 / 5)
మెక్‍గ్రాత్ ఫౌండేషన్ చొరవతో 2009లో ఈ పింక్ టెస్ట్ సంప్రదాయం మొదలైంది. అప్పటి నుంచి ప్రతీ సంవత్సరం పింక్ కిట్‍తో ఓ మ్యాచ్ ఆడుతూ వస్తోంది ఆసీస్.
ఇతర గ్యాలరీలు