(1 / 8)
చీరకు తగ్గట్లుగా బ్లౌజ్ లేకపోతే ఎంత ఖరీదైనా చీర అయినా దండగే అనిపిస్తుంది చూసేవాళ్లకి. అందుకే ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న బ్లౌజ్ స్లీవ్ డిజైన్లను వెతుకుతుంటారు మహిళలు, మీరు కట్టుకున్న చీరకు మోడ్రన్ లుక్ ఇచ్చే ట్రెండింగ్ స్లీవ్ డిజైన్లు కొన్ని ఇక్కడ ఉన్నాయి. నచ్చితే మీ టైలర్‌కి చూపించి కుట్టించుకోండి.
(2 / 8)
బ్లౌజ్ చేతి భాగంలో మధ్యలో ఇలా ఆకు ఆకారంలో కట్ వచ్చి, ముత్యాలతో అందంగా పొదిగిన ఈ డిజైన్ వేసుకుంటే చూడటానికి చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది.
(3 / 8)
బ్లౌజ్ అంతా ఇలా కట్స్, బటన్లతో సింపుల్ గా కనిపిస్తున్న ఈ డిజైన్ మీకు మోడ్రన్ లుక్ ఇస్తుంది. అందరిలోనూ మిమ్మల్ని హైలెట్ చేస్తుంది.
(4 / 8)
బ్లౌజ్ చేతుల మధ్య డైమండ్ షేపులో కట్ వచ్చి, మధ్యలో పువ్వు, చుట్టూరా పూసలతో ఉన్న ఈ స్లీ్ డిజైన్ సింపుల్ సాటిన్ చీరలకు బాగా సెట్ అవుతుంది.
(5 / 8)
ఏం రంగు చీరకైనా సెట్ అయ్యే గోల్డెన్ కలర్ బ్లౌజును ఇలా కట్స్, పూసలతొ కుట్టించుకుని వేసుకున్నారంటే అందిరలోనూ మీరు హైలైట్ అవుతారు.
(6 / 8)
చేయి చివర్లో ఇలా ట్రయాంగిల్ కట్, వీ షేన్ ఫ్లవర్ తో ఉన్న ఈ బ్లౌజ్ వేసుకున్నారంటే మీ చీరకు, మీకు గ్రాండ్ లుక్ వస్తుంది.
(7 / 8)
డబుల్ నెట్ స్లీవ్స్ తో ఆకట్టుకుంటున్న ఈ బ్లౌజ్ అన్ని రకాల ఫ్యాన్సీ చీరలకు బాగా సెట్ అవుతుంది.
(8 / 8)
ప్రత్యేకమైన పఫ్డ్ స్లీవ్స్ కలిగిన ఈ బ్లౌజ్ స్లీవ్స్ కుట్టించుకుని వేసుకుని బయలకు వెళ్లారంటే చాలా హుందాగా కనిపిస్తారు.
ఇతర గ్యాలరీలు