(1 / 5)
మోవెట్, యునైటెడ్ వే హైదరాబాద్ సౌజన్యంతో ఈ ఎనీ టైం కాటన్ బ్యాగ్ (బ్యాగ్ ఏటీఎం)ను ఏర్పాటు చేశారు.
(twitter)(2 / 5)
ప్లాస్టిక్‌ను ఉపయోగించకుండా వినియోగదారులు క్లాత్ బ్యాగ్‌లు వాడాలనే ఉద్దేశంతో ఐడీపీఎల్ పండ్ల మార్కెట్ సమీపంలో ఈ ఏటీఎంలను ఏర్పాటు చేశారు.
(twitter)(3 / 5)
ఈ మెషిన్‌లో 10 రూపాయల నోటు కానీ, కాయిన్ కానీ జారవిడవగానే వస్త్రంతో తయారు చేసిన ఒక క్యారీ బ్యాగ్ బయటికి వస్తుంది.
(twitter)(4 / 5)
మోవెట్ స్వచ్ఛంద సంస్థ రూ.2.5 లక్షలతో చెన్నై నుంచి ఈ మిషన్లను తెప్పించారని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. వీటి ద్వారా మహిళా సంఘాల వారికి కూడా ఉపాధి దొరకనుంది.
(twitter)(5 / 5)
హైదరాబాద్‌ను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడం కోసం పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ మిషన్ ఏర్పాటు చేశారు. ఇది వర్కౌట్ అయితే… నగర వ్యాప్తంగా అమల్లోకి తీసుకురానున్నారు. జిల్లాల్లో కూడా ఈ తరహా విధానానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.
(twitter)ఇతర గ్యాలరీలు