(1 / 6)
జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపు బకాయిదారులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 90 శాతం వడ్డీ మాఫీతో మొత్తం ఒకేసారి పన్ను బకాయిలు చెల్లించేలా మరోసారి ఓటీఎస్‌ను అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.
(2 / 6)
గతేడాది కూడా ఓటీఎస్ ను ప్రకటించారు. అయితే ఈసారి 90 శాతం వడ్డీ మాఫీతో మొత్తం ఒకేసారి పన్ను బకాయిలు చెల్లించేలా మరోసారి ఓటీఎస్‌ను అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ శుక్రవారం(మార్చి 07) ఉత్తర్వులు జారీ చేశారు.
(3 / 6)
ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఓటీఎస్ ద్వారా…. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం పన్నుతో పాటు వడ్డీ 10 శాతం చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.
(4 / 6)
వన్ టైమ్ సెటిల్‌మెంట్ అవకాశాన్ని ఉపయోగించుకుని నగర వాసులు సకాలంలో అస్తి పన్ను చెల్లించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ కోరారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
(5 / 6)
గతేడాది కూడా జీహెచ్ఎంసీ పరిధిలో ఓటీఎస్ ను తీసుకువచ్చారు. దీనివల్ల ఎంతో మంది ఆస్తి పన్ను చెల్లించేందుకు ముందుకొచ్చినట్లు అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈసారి కూడా అదే మాదిరిగా నగరవాసుల నుంచి స్పందన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
(6 / 6)
ఈ సారి ఆస్తి పన్నుకు సంబంధించి రూ. రెండు వేల కోట్లు వసూలు చేయడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ ముందుకెళ్తోంది. ఓటీఎస్ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో…. ఆశించిన స్థాయిలో పన్నులు వసూలు అవుతాయని మున్సిపల్ అధికారులు భావిస్తున్నారు.
ఇతర గ్యాలరీలు