Facial Tips for Glowing Skin | ఫేషియల్ చేసుకున్నా మొఖంలో మెరుపు రావడం లేదా?-get to know dos and don ts to attain glow after facial treatment ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  Get To Know Dos And Don'ts To Attain Glow After Facial Treatment

Facial Tips for Glowing Skin | ఫేషియల్ చేసుకున్నా మొఖంలో మెరుపు రావడం లేదా?

Sep 22, 2022, 04:38 PM IST HT Telugu Desk
Sep 22, 2022, 04:38 PM , IST

  • అప్పుడప్పుడు ఫేషియల్ చేయడం ద్వారా ముఖంపై ఉన్న డెడ్ స్కిన్‌ని తొలగించవచ్చు, ఇతర కొన్ని చర్మ సమస్యలు కూడా నయమవుతాయి. చర్మం కూడా చాలా రిఫ్రెష్‌గా కనిపిస్తుంది. కానీ కొందరికి ఫేషియల్ చేసినా మార్పు కనిపించదు. అందుకు కారణాలు, పరిష్కార మార్గాలు ఇక్కడ చూడండి.

ఫేషియల్ చేసుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదని భావిస్తున్నారా? లేదా అంతకుముందు ఉన్న మెరుపు కూడా తగ్గిపోయిందా? ఏమై ఉంటుంది.. దీనికి కొన్ని కారణాలున్నాయి.

(1 / 8)

ఫేషియల్ చేసుకున్న తర్వాత మీ ముఖంలో మెరుపు కనిపించాలి. కానీ కొంతమందికి మరుసటి రోజు నుంచే ముఖం డల్ గా కనిపించడం జరుగుతుంది. అదే సమయంలో ఇంకొంతమందికి ఫేషియల్ చేయించుకున్న తర్వాత మొటిమల సమస్య వస్తుంది. 

(2 / 8)

ఫేషియల్ చేసుకున్న తర్వాత మీ ముఖంపై మొటిమలు కనిపించడం ప్రారంభించినట్లయితే, ఆ ఫేషియల్‌లోని సమ్మేళనాలు మీకు పడనట్లు అర్థం. ఆ ఉత్పత్తులు మీ చర్మానికి సరైనవి కావు.

(3 / 8)

ఫేషియల్ చేసుకునేటపుడు ఫేస్ ప్యాక్‌పై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. మీ చర్మం జిడ్డుగా లేదా సెన్సిటివ్ గా ఉంటే, మీ చర్మానికి అనుగుణంగా ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. లేకుంటే మీ ముఖంలో మెరుపు రాదు, మీ చర్మ సమస్యలు తీరవు.

(4 / 8)

ఫేషియల్ చేసుకున్నపుడు సన్‌స్క్రీన్ అప్లై చేయకుండా ఎండలోకి అస్సలు వెళ్లకండి. దీనితో మీ చర్మం టాన్‌గా మారవచ్చు. అలాగే, ఫేషియల్‌లో ఉపయోగించే ఉత్పత్తులలోని రసాయనాలు కూడా సూర్యకిరణాలతో చర్య జరుపుతాయి.

(5 / 8)

ఫేషియల్ వేసుకున్న తర్వాత కనీసం ఒక వారం పాటు ఎలాంటి ఫెయిర్ నెస్ క్రీమ్‌లను అప్లై చేయవద్దు. ఒకేసారి వివిధ ఉత్పత్తులు ముఖంపై ప్రయోగిస్తే, ప్రయోజనాలకు బదులుగా హాని కలుగుతుంది.

(6 / 8)

ఫేషియల్ చేసుకున్న తర్వాత కూడా మళ్లీ వెంటనే ఫేస్ మాస్క్‌లు, ఫేస్ షీట్‌లను ముఖానికి అప్లై చేయడం నివారించాలి.

(7 / 8)

రసాయన ఉత్పత్తులే కాకుండా, ఫేషియల్ చేసుకున్న తర్వాత కొన్ని రోజుల పాటు హోమ్ స్కిన్ కేర్ ట్రీట్‌మెంట్‌లు లేదా DIYని ఉపయోగించకుండా ఉండండి.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు