Gannavaram Traffic : గన్నవరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తం- ప్రమాణ స్వీకారానికి రాలేకపోయిన డీజీపీ, నాగబాబు
- Gannavaram Traffic : గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీగా వీవీఐపీలు, టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు విఫలమవ్వడంతో.. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది.
- Gannavaram Traffic : గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీగా వీవీఐపీలు, టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు విఫలమవ్వడంతో.. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది.
(1 / 8)
గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీగా వీవీఐపీలు, టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు విఫలమవ్వడంతో.. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది.
(2 / 8)
ప్రమాణ స్వీకార కార్యక్రమ ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు చేతులెత్తేశారు. దీంతో 20 కి.మీ ప్రయాణానికి 4 గంటలు సమయం పట్టిందని కార్యక్రమానికి హాజరైన వాళ్లు అంటున్నారు.
(3 / 8)
ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్కసారిగా అందరు బయటకు రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో గవర్నర్ కాన్వాయ్ గంటన్నర పాటు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుంది.
(4 / 8)
స్టెరైల్ రూట్ ఏర్పాటు చేసినా వీఐపీలకు ఇబ్బందులు తప్పలేదు. ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్న నాగబాబు, అకీరా నందర్, మెగా కుటుంబ సభ్యులు ప్రమాణ స్వీకారానికి చేరుకోలేకపోయారు. ఐదు వోల్వో బస్సుల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు ప్రమాణ స్వీకారానికి రాగా, బస్సులు ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి.
(5 / 8)
ట్రాఫిక్ నియంత్రణలో పోలీసుల ఘోరంగా విఫలమయ్యారని నేతలు ఆరోపించారు. ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో డీజీపీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో డీజీపీ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లారు.
(6 / 8)
పోలీసుల ప్రణాళిక లోపంతో పాస్ లు ఉన్నా వేదిక వద్దకు చేరలేకపోయామని నాయకులు ఆరోపిస్తున్నారు. పలువురు నేతలు, ఎమ్మెల్యేలు ద్విచక్ర వాహనాలను ఆశ్రయించారు. చెన్నై కోల్ కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్ నరకంగా మారింది.
(7 / 8)
జగన్ పేషీలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ప్రవీణ్ ప్రకాశ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన విజయవాడ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సమయంలో విజయవాడ విమానశ్రయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఇతర గ్యాలరీలు