(1 / 8)
గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయమవుతున్న 'జూనియర్' చిత్రం జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
(2 / 8)
కిరీటి తొలి చిత్రం ‘జూనియర్’ పాన్ ఇండియా లెవల్లో విడుదలవుతోంది. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 'జూనియర్' విడుదల కానుంది.
(3 / 8)
'మాయాబజార్' ఫేం రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దక్షిణాది నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది.
(4 / 8)
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు భారీ, స్టార్ కాస్టింగ్ మరో హైలైట్ గా నిలుస్తోంది.
(5 / 8)
'క్రేజీస్టార్' రవిచంద్రన్, జెనీలియా దేశ్ ముఖ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'జూనియర్'.. కి జోడీగా నటి శ్రీలీల నటిస్తోంది.
(6 / 8)
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాహుబలి ఫేమ్ కన్నూ కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ స్టంట్స్ అందిస్తున్నారు.
(7 / 8)
'జూనియర్' రిలీజ్ డేట్ ఫిక్స్ కాగానే సినిమాను ప్రమోట్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. ఈ నెల 19న మొదటి పాటను విడుదల చేయనున్నారు.
(8 / 8)
'జూనియర్' ముహూర్తానికి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
ఇతర గ్యాలరీలు