తెలుగు న్యూస్ / ఫోటో /
Telangana Tourism : నేచర్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. పాకాలలో బోటు షికారుకు రైట్ రైట్!
- Telangana Tourism : పాకాల.. ఈ పేరు వినగానే స్వచ్ఛమైన గాలి, పచ్చని అడవులు గుర్తొస్తాయి. ఆ అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు వస్తుంటారు. తాజాగా.. పాకాల లవర్స్‌కు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గాల్లో నుంచి పాకాల అందాలను ఆస్వాదించే అవకాశం మళ్లీ కల్పిస్తోంది. బోటు షికారుకు లైన్ క్లియర్ కాబోతోంది.

(1 / 5)
జీవ వైవిధ్యభరితమైన అభయారణ్యం, కాలుష్య రహిత సరస్సు.. ఈ రెండు పాకాల సొంతం. కాకతీయుల కళావారసత్వ సంపదగా పాకాలకు పేరుంది. అందుకే పాకాల అందాలను ఆస్వాదించేందుకు టూరిస్టులు ఆసక్తి చూపిస్తారు.
(2 / 5)
ప్రకృతి అందాలకు నెలవైన పాకాలలో గతంలో బోటింగ్, జిప్‌లైన్ ఉండేది. కానీ.. అనివార్య కారణాల వల్ల పాకాల సరస్సులో బోటింగ్, జిప్‌లైన్‌ను నిలిపివేశారు. దీంతో పర్యాటకులు నిరాశ చెందారు. తాజాగా.. అటవీ శాఖ పాకాల లవర్స్‌కు శుభవార్త చెప్పింది.
(3 / 5)
అందమైన పాకాల ప్రకృతిలో విహరించేందుకు, బోటు షికారు చేసేందుకు అటవీశాఖ మళ్లీ ఏర్పాట్లు చేస్తుంది. అటు గతంలో పాకాల కట్టపై నుంచి 30 అడుగుల కిందకు ఏర్పాటు చేసిన జిప్‌లైన్ పనులను పునరుద్ధరించేందుకు నిధులు కేటాయించింది.
(4 / 5)
ఏపీలోని విశాఖలో ఏర్పాటు చేస్తున్న జిప్‌లైన్ మాదిరిగా.. ఉయ్యాల బుట్టల్లో విహరించేలా ఏర్పాట్లు చేయబోతున్నారు. ఈ అనుభూతిని పర్యాటకులకు అందించేందుకు అటవీశాఖ రూ.50 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది.
ఇతర గ్యాలరీలు