తెలుగు న్యూస్ / ఫోటో /
cumin water benefits: బీపీ, షుగర్లను నియంత్రించే ఈ సర్వరోగ నివారిణి మీ వంటింట్లోనే ఉంటుంది..
cumin water benefits: చాలా సాధారణ అనారోగ్య సమస్యలకు పరిష్కారాలు మన వంటింట్లోనే ఉంటాయి. అలాంటి వంటింటి ఔషధాల్లో ప్రధానమైనది జీలకర్ర. జీలకర్ర నీరు శరీరానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ నీటిని ఎందుకు తాగాలో చూద్దాం.
(1 / 7)
జీలకర్రను వంటల్లో విరివిగా ఉపయోగిస్తారు.దీని ముఖ్య కారణం రుచి మరియు వాసనను పెంచడం.అయితే అంతకు మించి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. జీలకర్రను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు, జీర్ణ సమస్యలు, మధుమేహం, రక్తహీనతతో పాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జీలకర్ర అనేక విధాలుగా పనిచేస్తుంది.
(2 / 7)
జీలకర్రలో ఐరన్, కాపర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, జింక్, పొటాషియం ఉన్నాయి.జీలకర్రను వివిధ రోగాలకు హోం రెమెడీగా ఉపయోగిస్తారు.జీలకర్ర నీరు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ శీతాకాలంలో ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగవచ్చు.
(3 / 7)
అజీర్ణం నుండి ఉపశమనం: చాలా మంది అజీర్ణం సమస్యతో బాధపడుతుంటారు. అజీర్తి సమస్యలు చాలా మందికి అనేక సమస్యలను కలిగిస్తాయి. దాని నుండి బయటపడటానికి జీలకర్ర నీటిని తాగడం ప్రారంభించవచ్చు.పరగడుపున జీలకర్ర నీటిని తాగడం వల్ల అజీర్తి రుగ్మతల నుండి ఉపశమనం పొందడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
(4 / 7)
బరువు తగ్గిస్తుంది: బరువు తగ్గాలనుకునేవారికి జీలకర్ర నీరు చాలా సహాయపడుతుంది.శరీరంలోని అన్ని రకాల మలినాలను తొలగిస్తుంది.మంచి జీర్ణశక్తి ఉంటే కొవ్వు, బరువు రెండూ త్వరగా తగ్గుతాయి. జీలకర్ర నానబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగితే శరీర బరువు అదుపులో ఉంటుంది.
(5 / 7)
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: జీలకర్ర నీరు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.ఇందులో పొటాషియం, ఐరన్, ఫైబర్ ఉంటాయి.జీలకర్ర నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.
(6 / 7)
మధుమేహాన్ని నియంత్రిస్తుంది: డయాబెటిస్ తో బాధపడేవారికి జీలకర్ర నీరు ప్రయోజనకరమైన పానీయం. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. జీలకర్ర మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది షుగర్ లెవల్స్ ను కూడా అదుపులో ఉంచుతుంది.తద్వారా డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
ఇతర గ్యాలరీలు