(1 / 8)
ఈ రోజు విడుదలైన కన్నప్ప సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు వంటి మహామహులు నటించారు. వారు ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యూరనేషన్ ఎంత అనే విషయంలో ఆసక్తి నెలకొన్నది.
(2 / 8)
కన్నప్ప విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం జూన్ 27న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా బావుందని, మంచు విష్ణు, ప్రభాస్ లు ఈ సినిమాను వేరే లెవెల్ కు తీసుకువెళ్లారని టాక్ వస్తోంది.
(3 / 8)
సాధారణంగా స్టార్స్ నటించి సినిమాల్లో వారి రెమ్యూనరేషన్ ఎంత ఉంటుందనే విషయంలో ప్రేక్షకులకు ఆసక్తి ఉంటుంది. మరి కన్నప్ప సినిమా కోసం ఎవరు ఎంత తీసుకున్నారో తెలుసుకుందాం.
(4 / 8)
అక్షయ్ కుమార్. కన్నప్పలో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ కనిపించారు. ఈ సినిమా కోసం అక్షయ్ రూ.6 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.
(5 / 8)
మోహన్ లాల్ - మలయాళ సినిమా సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ చిత్రంలో మిస్టీరియస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. కీలకమైన పాత్రే అయినప్పటికీ.. ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్ర నిడివి తక్కువగానే ఉంటుంది. అందువల్ల ఈ సినిమా కోసం ఆయన ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు.
(6 / 8)
ప్రభాస్. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరైన ప్రభాస్ 'కన్నప్ప'లో రుద్రుడి పాత్రలో నటించారు. మోహన్ లాల్ లా ప్రభాస్ కూడా ఈ సినిమా కోసం ఒక్క పైసా కూడా పారితోషికంగా తీసుకోలేదు. ఈ సినిమాలో ప్రభాస్ చాలా కీలకమైన, పవర్ ఫుల్ పాత్రలో నటించారు.
(7 / 8)
మంచు విష్ణు ఇటీవల మాట్లాడుతూ "ప్రభాస్, మోహన్ లాల్ ఈ సినిమా కోసం నా నుంచి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఈ సినిమా సక్సెస్ లో వారి పాత్ర చాలా ఉంది. వారికి రుణపడి ఉంటాను’’ అన్నారు.
(8 / 8)
కన్నప్పలో పార్వతి మాత గా కాజల్ అగర్వాల్ నటించారు. ఈ సినిమా కోసం కాజోల్ రూ.2 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా కోసం కాజోల్ ఆ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
ఇతర గ్యాలరీలు