Friendship Day 2022 : మీ ఫ్రెండ్ షిప్డేని ఇలా సెలబ్రేట్ చేసుకోండి..
- ఈ సంవత్సరం ఆగస్టు 7న ఫ్రెండ్‌షిప్ డే అంటే రేపే. కాబట్టి స్నేహితుల దినోత్సవాన్ని మరపురానిదిగా చేయడానికి ప్రత్యేకమైన రీతిలో జరుపుకోండి. మీకు ఏమి చేయాలో అర్థం కావట్లేదా అయితే వీటిని ఫాలో అయిపోండి.. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసేయండి.
- ఈ సంవత్సరం ఆగస్టు 7న ఫ్రెండ్‌షిప్ డే అంటే రేపే. కాబట్టి స్నేహితుల దినోత్సవాన్ని మరపురానిదిగా చేయడానికి ప్రత్యేకమైన రీతిలో జరుపుకోండి. మీకు ఏమి చేయాలో అర్థం కావట్లేదా అయితే వీటిని ఫాలో అయిపోండి.. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసేయండి.
(1 / 7)
ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. అయితే ఈ సంవత్సరం ఆగస్టు 7వ తేదీన మీరు మీ ఫ్రెండ్షిప్డేని మరచిపోకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
(Unsplash)(2 / 7)
ఫోటోలతో కూడిన అన్ని జ్ఞాపకాలను స్క్రాప్‌బుక్‌గా తయారు చేయండి. మొదటి పేజీలో మీ స్నేహితుడి గురించి మీ భావాలను వ్యక్తపరిచే నోట్ రాయండి. అనంతరం కొన్ని ఫోటోలతో ప్రత్యేక సందేశాలు, జోకులు వ్రాస్తారు. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఈ ఫోటో పుస్తకాన్ని మీ బెస్ట్ ఫ్రెండ్‌కి బహుమతిగా ఇవ్వండి.
(Unsplash)(3 / 7)
స్నేహితులతో కలిసి ఆటలు ఆడటం ఒక విభిన్నమైన వినోదం. స్నేహితులందరూ కలిసినప్పుడల్లా.. వారు ఖచ్చితంగా ఏవో కొన్ని ఆటలు ఆడటానికి ఇష్టపడతారు. ఈ ఫ్రెండ్‌షిప్ డేకి కూడా మీరందరూ కలిసి ఆన్‌లైన్ గేమ్‌లను కూడా ఆడవచ్చు.
(Unsplash)(4 / 7)
మీరు ఎప్పుడూ పనిలో బిజీగా ఉంటే.. మీ స్నేహితులతో ఎక్కువగా మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే.. రేపు మాత్రం వారికి సమయాన్ని వెచ్చించండి. అందరికీ ఫోన్ చేసి.. వారు మీకు ఎంత ప్రత్యేకంమో చెప్పండి.
(Unsplash)(5 / 7)
చేతితో తయారు చేసిన బహుమతులు ఎప్పుడూ హృదయానికి దగ్గరగానే ఉంటాయి. మీరిద్దరూ స్నేహితులుగా మారిన తర్వాత చేసిన ప్రయాణాన్ని ఆ కార్డులో రాసి.. వారికి ఇవ్వండి. అవి మీ ఫ్రెండ్ ముఖంలో చిరునవ్వును నింపుతుంది.
(Unsplash)(6 / 7)
మీరు ఫ్రెండ్‌షిప్ డే రోజున ఖాళీగా ఉన్నట్లయితే.. మీరు స్నేహితులతో కలిసి.. మీకు దగ్గర్లోని ప్లేస్‌లకు వెళ్లవచ్చు. మంచి ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు.
(Unsplash)ఇతర గ్యాలరీలు