Diabetic Foot Care: మధుమేహ‍ంలో పాదాల సంరక్షణే అత్యంత కీలకం…డయాబెటిస్‌తో పాదాలను కాపాడుకోండి ఇలా..-foot care is very important in diabetes how to take care of feet with diabetes ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Diabetic Foot Care: మధుమేహ‍ంలో పాదాల సంరక్షణే అత్యంత కీలకం…డయాబెటిస్‌తో పాదాలను కాపాడుకోండి ఇలా..

Diabetic Foot Care: మధుమేహ‍ంలో పాదాల సంరక్షణే అత్యంత కీలకం…డయాబెటిస్‌తో పాదాలను కాపాడుకోండి ఇలా..

Oct 01, 2024, 01:35 PM IST Bolleddu Sarath Chandra
Oct 01, 2024, 01:35 PM , IST

  • Diabetic Foot Care: మధుమేహం ఉన్నవారు పాదాలను తమ ముఖాన్ని చూసుకున్నంత జాగ్రత్తగా చూసుకోవాలని అంటారు. దాదాపు 15 శాతము డయాబెటిస్ రోగులు పాదముల సమస్యతో బాధపడి వుంటారు. ఈ క్రమంలో  పాదాలను ప్రతి రోజు పరీక్షించుకోవాలి. అద్దం సాయం కూడా తీసుకోవాలి. పాదాలు, గోర్లు, వ్రేళ్ళ మధ్య స్థలము మొదలైనవాటిని చూడాలి. 

పాదాలను ప్రతిరోజు పరీక్షించుకోవాలి. అద్దం సాయం కూడా తీసుకోవాలి. పాదాలు, గోర్లు, వ్రేళ్ళ మధ్య స్థలము మొదలైనవాటిని చూడాలి. రోగి చూపు మందగించినట్లయితే, కుటుంబ సభ్యుల సహకారంతో పరీక్షించుకోవాలి. పాదాలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. ప్రత్యేకించి వేళ్ళ సందులను పొడిగా, శుభ్రంగా వుంచుకోవాలి.  పాదాల పగుళ్ళకు మాయిశ్చరైజింగ్ క్రీమ్ వాడాలి. కాలివ్రేళ్ళ మధ్య తడిగా వుంచరాదు. పాదాలను నీటిలో నాన్చరాదు. పాదాల మీద వేడి నీటి బాటిల్స్ వుంచకూడదు.

(1 / 8)

డయాబెటిక్ ఫుట్ ఇన్ఫెక్షన్ వివిధ స్థాయిలలో ఉంటుంది. కొన్ని సార్లు పాదాలకు ప్రమాదం కలిగించని స్థితి ఉంటుంది. పాదాలలో చీము లేకపోవడం,   రక్తప్రసరణ సాధారణంగా వుండటం,   ఇన్ఫెక్షను లక్షణాలు లేకపోవడం,  ఇన్ఫెక్షను చర్మానికి పరిమితం కావడం వంటి లక్షణాలు ఉంటాయి. 

(2 / 8)

భారతీయులలో నిరక్షరాస్యత, చెప్పులు లేకుండా నడిచే అలవాటు, పేదరికం, పొగత్రాగే అలవాటు, సమస్య తీవ్రతపట్ల అవగాహనలేకపోవడం, వైద్యుడి వద్దకు సమస్య ముదిరినతరువాత వెళ్లడం వంటి కారణాల వలన కాలిపుండ్లు, గాయాలు తీవ్రమై కాలు తొలగించాల్సిన పరిస్థితులవరకూ వెళ్తున్నాయి

(3 / 8)

డయాబెటిస్ వున్నవారి పాదములలో మార్పురావడానికి వాస్కులర్ డిసీజ్.డయాబెటిక్ న్యూరోపతి,  ఇన్ఫెక్షన్ కారణం అవుతాయి. 

(4 / 8)

రక్తనాళములలో కొవ్వు పేరుకొని రక్తనాళాలు కుంచించుకుపోవడం జరుగుతుంది. అందువలన రక్తప్రసరణ తగ్గుతుంది. డయాబెటిస్ తో సాధారణంగా కలిసివుండే అధిక రక్తపోటు, హైపర్ లిపిడీమియా, మరియు ఇన్సులిన్ రెసిస్టన్స్లు ఈ సమస్యను మరింత పెంచుతాయి. ధూమపానం కూడా అలవాటుగావుంటే ఈ సమస్య ఎన్నోరెట్లు ఎక్కువ అవుతుంది.

(5 / 8)

డయాబెటిస్‌లో నాడుల సమస్యతో బాధపడేవారు నొప్పి, ఊష్ణోగ్రతలను గ్రహించలేక పోవడం వలన, యాంత్రిక, రసాయన మరియు అధిక ఊష్ణోగ్రతలను పాదములు స్పర్శతో గ్రహించలేక, ఏదేని గాయం తగిలినా వారు గుర్తించలేరు, మళ్ళీ మళ్ళీ గాయం మీద ఒత్తిడి, రాపిడి జరిగినా గ్రహించలేరు. దీని వలన గాయం మానకపోవడం, పెద్దది కావడం జరుగుతుంది.

(6 / 8)

డయాబెటిస్ వున్న వారిలో రక్తప్రసరణ సరిగా జరుగకపోవడం, రోగ నిరోధక శక్తి తక్కువ కావడం వలన ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా వుంటుంది. గాయమైన చోటుకు రక్తం సరఫరా జరుగక పోవడం వలన కణజాలం నశించి, ఆప్రాంతంలో బాక్టీరియా ఎక్కువగా పెరగడానికి కారణమవుతుంది. డయాబెటిక్ ఫుట్‌లో అనేకరకాల క్రిములు పెరుగుతాయి.

(7 / 8)

డయాబెటిక్ మోటార్ న్యూరోపతి వలన చిన్న కండరములు బలహీనమై కాలి వేళ్ళు వంకరలు పోతాయి. దీనివలన సన్నని ఎముకల చివర్లు నేల వైపు పొడుచుకువచ్చి వాటి మీద వత్తిడి పెరిగి, పుండ్లు ఏర్పడతాయి. అటనామిక్ న్యూరోపతి వలన చర్మం పొడిగా మారి కాళ్లలో పగుళ్ళు ఏర్పడతాయి. పగుళ్ళ ద్వారా ఇన్ఫెక్షను పాదం లోపలకు ప్రవేశిస్తుంది. టెండానులు, ప్లాంటార్ ఫేసియా వంటి తెల్లటి టిష్యూలు బాక్టీరియాను నిరోధించలేవు. అందువలన పాదాలలోపలి భాగాలకు కూడా ఇన్ఫెక్షన్ ప్రాకుతుంది. 

(8 / 8)

ఇతర గ్యాలరీలు