Korean Glass Skin : గ్లాస్​ స్కిన్ కావాలనుకుంటే.. వీటిని ఫాలో అయిపోండి..-follow these tips for korean glass skin ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Follow These Tips For Korean Glass Skin

Korean Glass Skin : గ్లాస్​ స్కిన్ కావాలనుకుంటే.. వీటిని ఫాలో అయిపోండి..

Jul 27, 2022, 12:45 PM IST Geddam Vijaya Madhuri
Jul 27, 2022, 12:45 PM , IST

కొరియన్ గ్లాస్ స్కిన్ ఇప్పుడు విస్తృతంగా ఆచరణలో ఉంది. అయితే మీరు కూడా ఇలా మెరిసే చర్మాన్ని పొందాలనుకుంటున్నారా? అయితే కొన్ని సహజ పద్ధతులతో మెరిసే చర్మాన్ని పొందవచ్చు అంటున్నారు చర్మ నిపుణులు. అవేంటో మీరు తెలుసుకుని ఫాలో అయిపోండి. 

కొరియన్లు చర్మసౌందర్యానికి బాగా ప్రసిద్ధి చెందారు. గ్లాస్ స్కిన్ అనే భావన వారి నుంచే వచ్చింది. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా ఆచరణలో ఉన్నప్పటికీ.. ప్రాథమికంగా గాజు చర్మం అంటే మచ్చలేని, మృదువైన, మెరిసే చర్మం. కానీ మీకు తెలుసా.. కొన్ని పురాతన భారతీయ నివారణలను ఉపయోగించడం ద్వారా అటువంటి చర్మాన్ని పొందడం సాధ్యమవుతుందని. అయితే మీరు ఆ ట్రిక్కులేమిటో తెలుసుకుని.. మెరిసిపోండి. 

(1 / 5)

పొడి చర్మానికి కలబంద చాలా మేలు చేస్తుంది. చర్మంపై మచ్చలను పోగొట్టడానికి కూడా కలబందను ఉపయోగించవచ్చు. కలబంద ఆకుల నుంచి జెల్‌ని తీసి నేరుగా చర్మంపై అప్లై చేయండి. 30-40 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటితో కడగాలి.

(2 / 5)

పొడి చర్మానికి కలబంద చాలా మేలు చేస్తుంది. చర్మంపై మచ్చలను పోగొట్టడానికి కూడా కలబందను ఉపయోగించవచ్చు. కలబంద ఆకుల నుంచి జెల్‌ని తీసి నేరుగా చర్మంపై అప్లై చేయండి. 30-40 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటితో కడగాలి.(Pixabey)

కొరియన్ అమ్మాయిల మాదిరిగా మంచి చర్మాన్ని పొందడానికి మరొక మార్గం రైస్ వాటర్. ఏదైనా బియ్యాన్ని తీసుకుని.. పైన ఉన్న మురికిని వదిలించుకోవడానికి ఒకసారి శుభ్రమైన నీటితో రైస్ శుభ్రం చేసుకోండి. ఇప్పుడు కడిగిన బియ్యాన్ని ఒక పెద్ద గిన్నెలో వేసి అందులో 2-3 కప్పుల నీరు పోయాలి. ఇలా 30 నిమిషాల పాటు ఉంచండి. రైస్ నుంచి బియ్యాన్ని వేరు చేయాలి. ఇప్పుడు శుభ్రమైన సీసాలో నీటిని నింపండి. దీనిని రెగ్యూలర్​గా ఉపయోగిస్తే.. ఈ నీరు UV కిరణాల వల్ల కలిగే చర్మ నష్టాన్ని సరిచేయడానికి సహాయపడుతుంది.

(3 / 5)

తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షించడమే కాకుండా తేమను కాపాడడంలో కూడా సహాయపడతాయి. కానీ సేంద్రీయ తేనెను ఉపయోగించడం ఉత్తమమని గుర్తుంచుకోండి.

(4 / 5)

ఇవే కాకుండా రోజూ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కనీసం రోజుకు ఒకసారి CTM రొటీన్ చేయండి. ముందుగా మీ ముఖాన్ని క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోండి. అనంతరం దానిపై టోనర్ రాయండి. చివరగా మాయిశ్చరైజర్ రాయండి. చర్మాన్ని క్రమం తప్పకుండా శుభ్రంగా ఉంచుకుంటే.. మచ్చలు, మొటిమల సమస్యలు తగ్గుతాయి.

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు