
(1 / 6)
ఇంటిని నిరంతరం శుభ్రపరచడం, దుమ్ము దులపడం, తుడవటం మొదలైన వాటితో అలసిపోతుంంటే, మీ హౌజ్ క్లీనింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. మీరు కొన్ని సాధారణ హక్స్‌తో సులభంగా శుభ్రం చేయవచ్చు.
(Unsplash)
(2 / 6)
నిమ్మరసం, బేకింగ్ సోడా రెండూ సమపాళ్లలో కలపండి, ఈ మిశ్రమాన్ని సింక్ లో పోసి, 5 నిమిషాలు అలాగే వదిలివేసి, వేడి నీటిని పారబోయండి. ఈ ట్రిక్‌ను నెలకోసారి పునరావృతం చేయడం వల్ల డ్రైన్ బ్లాక్ అవ్వదు. తాజా వాసనతో పరిశుభ్రంగా ఉంటుంది.
(Pinterest)
(3 / 6)
వెనిగర్, బేకింగ్ సోడాను సమపాళ్లలో కలిపి ఈ మిశ్రమాన్ని ఓవెన్‌పై వేయండి. 30 నిమిషాలు అలాగే ఉంచండి, తర్వాత స్క్రబ్ చేసి తడి గుడ్డతో తుడవండి. ఈ హ్యాక్‌ని నెలకు ఒకసారి పునరావృతం చేయవచ్చు.
(Pinterest)
(4 / 6)
కార్న్‌ఫ్లోర్, నిమ్మరసం సమపాళ్లలో మిక్స్ చేసి, అందులో మెత్తని గుడ్డను ముంచి, వెండి వస్తువులను తుడిస్తే కొత్తవాటిలా మెరుస్తాయి.
(Pinterest)
(5 / 6)
విండో క్లీనింగ్ సొల్యూషన్ కోసం నీటిలో కొంచెం వెనిగర్ కలిపి స్ప్రే బాటిల్‌లో నింపాలి. కిటికీలపై ద్రావణాన్ని పిచికారీ చేసి పొడి గుడ్డతో తుడవండి. కిటికీలు మెరుస్తాయి.
(Pinterest)

(6 / 6)
కూరగాయలు కట్ చేసే కట్టింగ్ బోర్డ్‌లో ఉప్పు చల్లి నిమ్మకాయ ముక్కలతో రుద్దండి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి
(Pinterest)ఇతర గ్యాలరీలు