(1 / 5)
పాకిస్థాన్ బ్యాటింగ్ లో దూకుడే లేదు. ఇంకా పాత తరం ఆటతోనే ఆ జట్టు సాగుతోంది. టీ20ల్లోనే వన్డే ఆటతీరుతో సాగే పాక్.. ఇక వన్డేల్లో టెస్టు బ్యాటింగ్ ను తలపిస్తోంది. కరాచిలో న్యూజిలాండ్ 320 పరుగులు చేస్తే పాక్ 260 కే ఆలౌటైంది. భారత్ తో మ్యాచ్ లో 241 పరుగులే చేసింది. ఇండియాతో మ్యాచ్ లో ఆ జట్టు 152 డాట్ బాల్స్ ఆడింది.
(x/TheRealPCB)(2 / 5)
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ జట్టు ఎంపికే పేలవం. రెగ్యులర్ ఓపెనర్ ను ఎంపిక చేయకుండా జమాన్ తో బాబర్ ఓపెనింగ్ చేస్తాడని అనుకున్నారు. కానీ జమాన్ గాయంతో ఎదురు దెబ్బ తగిలింది. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కేవలం అబ్రార్ అహ్మద్ ను మాత్రమే జట్టులోకి తీసుకున్నారు. రెండేళ్లుగా వన్డేలు ఆడని అష్రఫ్, ఖుష్దిల్ ను ఎంపిక చేశారు.
(x/TheRealPCB)(3 / 5)
గాయాలు కూడా పాక్ ను దెబ్బతీశాయి. ఓపెనర్ ఫకర్ జమాన్ న్యూజిలాండ్ తో మ్యాచ్ లో గాయపడి టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. మరోవైపు యంగ్ ఓపెనర్ సయీం ఆయూబ్ ఇంజూరీతో ఈ టోర్నీకే ఎంపిక కాలేదు. మరోవైపు కీలక ఆటగాళ్లను భర్తీ చేసే రిజర్వ్ బెంచ్ బలం పాక్ లేదు.
(Reuters)(4 / 5)
కెప్టెన్ రిజ్వాన్, స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం, టాప్ పేసర్ షహీన్ షా అఫ్రిది ఫెయిల్యూర్ పాక్ ను ముంచేసింది. కివీస్ తో బాబర్ హాఫ్ సెంచరీ చేసినా జట్టుకు ఉపయోగపడేలా వేగంగా ఆడలేడనే విమర్శలు వచ్చాయి. భారత్ తో మ్యాచ్ లో అతను 23 పరుగులే చేశాడు. కివీస్ పై 3 పరుగులు చేసిన రిజ్వాన్.. ఇండియాపై 46 పరుగులు చేసినా కీలక సమయంలో ఔటయ్యాడు. షహీన్ ఏమో భారీగా పరుగులిచ్చేశాడు.
(x/TheRealPCB)(5 / 5)
పాకిస్థాన్ జట్టుకు ఎప్పుడు ఏ కోచ్ ఉంటాడో చెప్పడం కష్టమే. ఆటగాళ్ల సెలక్షన్ విషయంలో కోచ్ లకు జోక్యం చేసుకునే అవకాశం పీసీబీ ఇవ్వదు. దీంతో లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ కోచ్ గా గ్యారీ కిర్ స్టన్, టెస్టు కోచ్ గా గిలెస్సీ రాజీనామా చేశారు. దీంతో ఆఖిబ్ జావేద్ కు తాత్కాలిక బాధ్యతలు అప్పజెప్పారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ ఫెయిల్యర్ తో అతనిపైనా వేటు పడే సూచనలు కనిపిస్తున్నాయి.
(AFP)ఇతర గ్యాలరీలు