(1 / 7)
త్వరలోనే శని దేవుడు తిరోగమన దిశలో సంచరించనున్నాడు. జూన్ 29వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీన వరకు కుంభరాశిలో శని తిరోగమనం చెందనున్నాడు.
(2 / 7)
శని తిరోగమనం వల్ల జూన్ 29 నుంచి నవంబర్ 15 మధ్య ఐదు రాశుల వారికి అదృష్టం పెరగనుంది. ఆర్థిక సహా చాలా విషయాల్లో లాభాలు దక్కుతాయి. ఆ రాశులు ఏవంటే..
(3 / 7)
కన్యా: శనితిరోగమనం కన్యా రాశి వారి అదృష్టాన్ని పెంచుతుంది. ఈ కాలంలో వారు చాలా ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. చాలా శుభదాయకంగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు రావొచ్చు. వాయిదాలు పడుతూ వస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయి. వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు కుదరొచ్చు.
(4 / 7)
వృషభం: శని తిరోగమనం కాలంలో వృషభ రాశి వారికి కలిసి వస్తుంది. ఉద్యోగాల్లో ఉన్న వారికి ప్రమోషన్లు లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి ఫలితాలు లభిస్తాయి. ఈ కాలంలో వారు ఆస్తులను కొనుగోలు చేయడం కూడా మంచిది. ఆర్థికంగా మెరుగ్గా ఉంటారు.
(5 / 7)
తులారాశి: ఈ కాలంలో తులారాశి వారికి శుభాలు జరుగుతాయి. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పెండింగ్‍లో ఉన్న పనులపై శ్రద్ధ వహించి పూర్తి చేసే అవకాశాలు ఉంటాయి. పనులు విజయవంతం అయ్యేలా కార్యసిద్ధి ఉంటుంది. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు అందే అవకాశాలు ఉంటాయి.
(6 / 7)
ధనస్సు: ఈ కాలంలో ధనస్సు రాశి వారికి బాగా కలిసి వస్తుంది. నిలిచిపోయిన పనులను మళ్లీ ప్రారంభిస్తే విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా పరిస్థితి మెరుగవుతుంది. ఈ కాలం వీరు దానాలు చేస్తే మరింత ఫలితం ఉంటుంది.
(Freepik)(7 / 7)
మకరం: శనితిరోమగనం మకర రాశి వారికి కూడా ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుభ ఫలితాలు ఉంటాయి. పనుల్లో ఉండే అడ్డుంకులు తొలగిపోతాయి. ఈ కాలంలో ప్రారంభించే కొత్త పనులు సఫలీకృతమయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ కథనాన్ని రూపొందించాం. దీనికి శాస్త్రీయ ఆధారాలు ఉండవు)
ఇతర గ్యాలరీలు