Beetroot Recipes: ఆరోగ్యకరమైన బీట్రూట్‌తో అద్భుతమైన ఐదు రకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు! అవేంటో ఓ లుక్కేసేయండి!-five amazing recipes can be made with healthy beetroot look at that ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Beetroot Recipes: ఆరోగ్యకరమైన బీట్రూట్‌తో అద్భుతమైన ఐదు రకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు! అవేంటో ఓ లుక్కేసేయండి!

Beetroot Recipes: ఆరోగ్యకరమైన బీట్రూట్‌తో అద్భుతమైన ఐదు రకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు! అవేంటో ఓ లుక్కేసేయండి!

Published Feb 15, 2025 12:18 PM IST Ramya Sri Marka
Published Feb 15, 2025 12:18 PM IST

  • Beetroot Recipes: రుచికరమైన,ఆరోగ్యకరమైన వంటకాల కోసం వెతుకుతున్నారా? ఈ బీట్‌రూట్ రెసిపీలు మీ నోరు ఊరేలా చేస్తుంది. ఇవి మీ శరీరానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తాయి.బీట్‌రూట్‌తో తయారు చేయగల ఐదు అద్భుతమైన రెసిపీలేంటో తెలుసుకుందాం రండి..

బీట్‌రూట్ స్మూతీ: బీట్‌రూట్ స్మూతీ రిఫ్రెష్‌మెంట్‌, హెల్తీ డ్రింక్.  దీన్ని తయారు చేసుకోవడం చాలా సులువు. ముఖ్యంగా వ్యాయామం తర్వాత మీ శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఉడికించిన లేదా పచ్చి బీట్‌రూట్‌లను తీసుకుని, వాటితో పాటు బానానా, ఆపిల్, బెర్రీస్, యోగర్ట్ లేదా బాదం పాలు అన్నింటినీ ముక్కలు ముక్కలుగా   మిక్సీలో పట్టుకుంటే సరిపోతుంది. సూపర్ రుచికరమైన బీట్‌రూట్ స్మూతీ రెడీ అయిపోతుంది.

(1 / 5)

(pexel)

బీట్‌రూట్ సలాడ్: ఇది చాలా సింపుల్ డిష్ అయినప్పటికీ ఇది మీకు చాలా తృప్తినిస్తుంది. వేయించిన లేదా ఉడికించిన బీట్‌రూట్‌లతో దీన్ని తయారు చేయవచ్చు. బీట్‌రూట్‌లను ముక్కలతో పాటు మీకు నచ్చిన తులసి, పుదీనా వంటి గ్రీన్స్, నట్స్, చీజ్‌ వేసి కలపండి. దీంట్లోనే కాస్త ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, తేనె కలిపితే సలాడ్ మరింత రుచిగా ఉంటుంది.  

(2 / 5)

బీట్‌రూట్ రైతా: బీట్‌రూట్‌ను తురుముకుని, ఉడికించి దాంట్లో పెరుగు వేసి కలపండి. దీంట్లో కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి కూడా వేయండి. పెరుగులోని క్రీమీ టెక్స్చర్, బీట్‌రూట్ రుచికి సరిగ్గా సెట్ అవుతుంది. అద్భుతంగా ఉంటుంది. దీన్ని మీరు స్నాక్స్ లేదా బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. ఈ బీట్‌రూట్ రెసిపీ మీకు చాలా నచ్చుతుంది.

(3 / 5)

బీట్‌రూట్ పరాటా: బీట్‌రూట్‌తో రుచికరమైన పరాటాలను తయారు చేసుకోవచ్చు. తురిమిన లేదా మెత్తగా చేసిన బీట్‌రూట్‌ను గోధుమ పిండిలో వేసి కలపాలి. తర్వాత దీంట్లోనే జీలకర్ర, కారం పొడి, ఉప్పు వేసి చపాతీ పిండిలాగా పసికి పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత ఈ పిండితో పరాటాలు చేసుకున్నారంటే రుచి అదిరిపోతుంది. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి.

(4 / 5)

బీట్‌రూట్ రైస్:  ఇది చూడటానికి అందంగా ఉంటుంది.పోషకాలతో కూడా నిండి ఉంటుంది. బీట్‌రూట్‌ను తురిమి, వేయించి, వడబోసిన బియ్యం సాదంలో కలిపి వండాలి. తీపి, కారం కలగలిపిన రుచి కలిగిన బీట్‌రూట్ రైస్ నేరుగా తినేయచ్చు. లేదా మీకు నచ్చిన కూరతో కలుపుకుని తినేయచ్చు.

(5 / 5)

(https://creativecommons.org/licenses/by-sa/4.0)

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.
WhatsApp channel

ఇతర గ్యాలరీలు