తెలుగు న్యూస్ / ఫోటో /
AP Heavy Rains : తీరం వైపు దుసుకొస్తోన్న ఫెంగల్ తుపాను, ఏపీలో అతి భారీ వర్షాలు-ఆందోళనలో రైతన్నలు
AP Heavy Rains : ఏపీపై ఫెంగల్ తుపాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. సరిగ్గా పంటలు కోతకొచ్చిన సమయంలో తుపాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. తుపాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 6)
ఏపీపై ఫెంగల్ తుపాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. సరిగ్గా పంటలు కోతకొచ్చిన సమయంలో తుపాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వరి రైతులను అకాల వర్షాలు కన్నీరు పెట్టిస్తున్నాయి.
(2 / 6)
నైరుతి బంగాళాఖాతంలో 'ఫెంగల్ ' తుపాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిమీ వేగంతో కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాన్ ప్రస్తుతానికి పుదుచ్చేరికి 100 కి.మీ, చెన్నైకి 100 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. తుపాను తీరానికి చేరుకునే సమయంలో నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
(3 / 6)
శనివారం సాయంత్రానికి తుపాను ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల దగ్గర కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్నిచోట్ల అతితీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
(4 / 6)
తుపాను ప్రభావంతో తీరం వెంబడి 70-90 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
(5 / 6)
ఫెంగల్ తుపాను ప్రభావంతో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, నెల్లూరు, చిత్తూరు, కడప, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరి కోతల సమయం కావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇతర గ్యాలరీలు