February Movies: ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే.. స్టార్ హీరోలతో తలపడనున్న నాగ చైతన్య, సాయి పల్లవి!-february released movies in all south languages naga chaitanya thandel to malayalam megastar mammootty bazooka clashes ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  February Movies: ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే.. స్టార్ హీరోలతో తలపడనున్న నాగ చైతన్య, సాయి పల్లవి!

February Movies: ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే.. స్టార్ హీరోలతో తలపడనున్న నాగ చైతన్య, సాయి పల్లవి!

Feb 01, 2025, 07:43 PM IST Sanjiv Kumar
Feb 01, 2025, 07:43 PM , IST

February Released Movies 2025: ఫిబ్రవరి నెలలో ఎన్నో ఆసక్తికరమైన చిత్రాలు విడుదల కానున్నాయి. వాటి వివరాలు ఇక్కడ చూడండి!

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, త్రిష, రెజీనా కాసాండ్రా నటించిన లేటెస్ట్ సినిమా విడాముయార్చి. జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా ఫిబ్రవరి 6కు పోస్ట్‌పోన్ అయింది. అంటే, ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న నాగ చైతన్య సినిమాతో అజిత్ మూవీ తలపడనుంది. 

(1 / 5)

తమిళ హీరో, డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ సినిమా డ్రాగన్. అశ్వత్ మారీముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుందని ముందుగా ప్రకటించారు. కానీ, అజిత్ విడాముయార్చి చిత్రం విడుదల తేదీ ప్రకటించడంతో 'డ్రాగన్' సినిమా విడుదల తేదీని ఫిబ్రవరి 21కి మార్చారు.

(2 / 5)

తమిళ హీరో, డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ సినిమా డ్రాగన్. 

అశ్వత్ మారీముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుందని ముందుగా ప్రకటించారు. కానీ, అజిత్ విడాముయార్చి చిత్రం విడుదల తేదీ ప్రకటించడంతో 'డ్రాగన్' సినిమా విడుదల తేదీని ఫిబ్రవరి 21కి మార్చారు.

స్టార్ హీరో ధనుష్ కథ, దర్శకత్వం వహించిన సినిమా జాబిలమ్మ నీకు అంత కోపమా. పవర్ పాండి, రాయన్ తర్వాత ధనుష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ కానుంది. అయితే, ఫిబ్రవరి 6న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. 

(3 / 5)

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా తండేల్. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. 

(4 / 5)

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా తండేల్. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. 

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం బజూక. ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మేనన్ కూడా నటించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. అంటే, మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి అక్కినేని నాగ చైతన్యకు వారం రోజుల గ్యాపుతో పోటీగా రానున్నాడని తెలుస్తోంది. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు