AP Tourism : విజయనగరం జిల్లా.. చరిత్రకు అద్ధం.. ప్రకృతి అందాలకు నిలయం!
- AP Tourism : విజయనగరం జిల్లాకు ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. సహజ సౌందర్యానికి పెట్టింది పేరు. ఈ జిల్లాలో చూడదగ్గ ప్రదేశాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా బొబ్బిలి కోట, చింతపల్లి బీచ్, తాటిపూడి జలయాశం వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వాటి విశేషాలు ఇప్పుడు చూద్దాం.
- AP Tourism : విజయనగరం జిల్లాకు ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. సహజ సౌందర్యానికి పెట్టింది పేరు. ఈ జిల్లాలో చూడదగ్గ ప్రదేశాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా బొబ్బిలి కోట, చింతపల్లి బీచ్, తాటిపూడి జలయాశం వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వాటి విశేషాలు ఇప్పుడు చూద్దాం.
(1 / 7)
విజయనగరం జిల్లాలోని చింతపల్లి బీచ్ ప్రశాంతతకు మారుపేరు. విస్తారమైన ఇసుక తీరం, నిర్మలమైన నీరు, అందమైన సూర్యాస్తమాలు ఈ బీచ్ ప్రత్యేకతలు. ఈ బీచ్‌లోని నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. స్నానం చేయడానికి, జల క్రీడలు ఆడడానికి ఇది అనువైన ప్రదేశం. బీచ్ చుట్టూ ఉన్న ప్రకృతి అందం మంత్రముగ్ధులను చేస్తుంది.
(2 / 7)
బొబ్బిలి కోట అద్భుతమైన నిర్మాణం. చారిత్రక నేపథ్యానికి ప్రసిద్ధి. ఈ కోట వెనుకాల ఎన్నో కథలు, పురాణాలు దాగి ఉన్నాయి. బొబ్బిలి కోటను 17వ శతాబ్దంలో వెంకట గిరి రాజు నిర్మించారు. ఈ కోటకు సంబంధించి ముఖ్యంగా రాణి వెల్లంకి సున్నమ్మ కథ ప్రసిద్ధి. ఆమె పతి మరణం తర్వాత తన కుమారుని కోసం రాజ్యాన్ని పరిపాలించి, శత్రువులతో పోరాడి విజయం సాధించింది. ఆమె వారత్వానికి నిదర్శనంగా ఈ కోట నిలుస్తుంది.
(3 / 7)
జిల్లా కేంద్రంలో.. విజయనగరం కోట ఉంది. దీనికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ప్రశాంత వాతావరణంతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడికి చాలా ఈజీగా చేరుకోవచ్చు.
(4 / 7)
విజయనగరం జిల్లాలో వెలసిన శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం.. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. పైడితల్లి అమ్మవారిని పూసపాటి రాజులు కులదైవంగా పూజిస్తారు. ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం ఉంది. అద్భుతమైన శిల్పకళ, వైభవంగా జరుగుతున్న ఉత్సవాలకు ప్రసిద్ధి చెందింది.
(5 / 7)
విజయనగరం జిల్లా కేంద్రంలో వెలసిన రాజావారి కోట.. దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ కోటల్లో ఒకటి. ఇది అద్భుతమైన నిర్మాణం. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షిస్తుంది.
(6 / 7)
విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలంలో ఉన్న సరిపల్లి.. చంపావతి నది ఒడ్డున వెలసిన ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం ప్రధానంగా దిబ్బి లింగేశ్వర స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది. చారిత్రకంగా చాలా ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయం.. చాళుక్యుల కాలంలో నిర్మించబడిందని భావిస్తారు. ఇది ప్రశాంతమైన ప్రదేశం. ఇక్కడ ఉన్న దిబ్బి లింగేశ్వర స్వామి ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
(7 / 7)
విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలం తాటిపూడి గ్రామం సమీపంలో.. తాటిపూడి జలాశయం ఉంది. ఇది ఆ ప్రాంత ప్రజలకు జీవనాధారం. 1968లో దీన్ని నిర్మించారు. గోస్తని నదిపై ఇది ఉంది. ఈ జలాశయం చుట్టుపక్కల ప్రాంతాలకు తాగునీరు, వ్యవసాయానికి సాగునీరు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జలాశయం చుట్టూ ఉన్న పచ్చని పొలాలు, కొండలు, అడవులు అద్భుతమైన అందాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.
ఇతర గ్యాలరీలు