Telangana Tourism : నిజామాబాద్ జిల్లాకు వెళ్తున్నారా.. అయితే ఈ 7 ప్రదేశాలను అస్సలు మిస్ కావొద్దు!-features of 7 popular tourist destinations in nizamabad district ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Telangana Tourism : నిజామాబాద్ జిల్లాకు వెళ్తున్నారా.. అయితే ఈ 7 ప్రదేశాలను అస్సలు మిస్ కావొద్దు!

Telangana Tourism : నిజామాబాద్ జిల్లాకు వెళ్తున్నారా.. అయితే ఈ 7 ప్రదేశాలను అస్సలు మిస్ కావొద్దు!

Jan 16, 2025, 06:03 PM IST Basani Shiva Kumar
Jan 16, 2025, 06:03 PM , IST

  • Telangana Tourism : నిజామాబాద్ జిల్లా.. చారిత్రక, సాంస్కృతిక, సహజ సౌందర్యానికి పెట్టింది పేరు. ఈ జిల్లాలో అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ఇందూరుకు వెళ్తే.. ముఖ్యంగా 7 ప్రదేశాలను తప్పకుండా చూడాలని చెబుతారు. ఆ టూరిస్ట్ స్పాట్‌ల ప్రత్యేకతలు ఏంటో ఓసారి చూద్దాం.

డిచ్‌పల్లి రామాలయం.. నిజామాబాద్ నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలో 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. 14వ శతాబ్దంలో కాకతీయ రాజులు దీన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. నలుపు, తెలుపు అగ్గిరాయితో ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రాచీన నిర్మాణ శైలికి ఈ రామాలయం ప్రసిద్ధి.

(1 / 7)

బాదాపహాద్ దర్గానే పెద్ద గుట్ట అని కూడా పిలుస్తారు. ఇది ముస్లిం యాత్రా కేంద్రం. సయ్యద్ హజ్రత్ సాదుల్లాహ్ హుస్సేన్ జ్ఞాపకార్థం దీన్ని నిర్మించారు. ఈ మసీదు నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలం జాకోరా సమీపంలో కొండపై ఉంది. అనేకమంది ముస్లిం భక్తులు ఇక్కడికి వస్తారు. హిందువులు కూడా కొండపైకి ఎక్కి సయ్యద్ హజ్రత్ సాదుల్లాహ్ బాబాను దర్శిస్తారు. 

(2 / 7)

నిజామాబాద్ జిల్లాలో శ్రీ నవానాథ సిద్ధేశ్వర దేవాలయానికి ప్రత్యేకత ఉంది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పట్టణం నుండి 27 కి.మీ. దూరంలో ఉన్న జన్కంపేట్ గ్రామంలో ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని శివుడికి అంకితం చేశారని అక్కడి ప్రజలు చెబుతారు. ఇక్కడ శివుడిని అత్యంత శక్తివంతమైన స్వరూపాలలో ఒకటిగా భావిస్తారు.

(3 / 7)

నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ కోటకు చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఈ కోటను కాకతీయ రాజులు నిర్మించారు. కోటలో శివాలయం కూడా ఉంటుంది. కోట ప్రధాన ముఖద్వారం అసఫ్‌జాహీల నిర్మాణ శైలికి అద్దంపడుతుంది. కోట నిర్మాణంలో ఉపయోగించిన కళా నైపుణ్యాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

(4 / 7)

సిర్నాపల్లి ఒక చారిత్రక ప్రదేశం. ఇక్కడ రాణి జానకీబాయి నిర్మించిన అనేక భవనాలు, మందిరాలు ఉన్నాయి. అలాగే సమీపంలో జలపాతం కూడా ఉంది. సిర్నాపల్లి జలపాతాన్ని తెలంగాణ నయాగరా అని కూడా పిలుస్తారు. ఈ జలపాతం ప్రకృతి ప్రేమికులకు స్వర్గం.

(5 / 7)

గంగాధర గ్రామం సహజ సౌందర్యానికి పుట్టినిల్లు. ఇది ప్రశాంతమైన వాతావరణంలో విశ్రాంతి తీసుకోవాలనుకుంటే.. ఇది అద్భుతమైన ప్రదేశం. గ్రామీణ జీవనాన్ని అనుభవించాలనుకునే వారికి ఇది అనువైన ప్రదేశం. చుట్టూ కొండలు, నీరు ఇక్కడి ప్రత్యేకత.

(6 / 7)

బాసర సరస్వతి దేవాలయం నిజామాబాద్- ఆదిలాబాద్ జిల్లాలో బార్డర్‌లో ఉంటుంది. కానీ.. దీన్ని నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ పర్యాటక కేంద్రంగా పరిగణిస్తారు. సరస్వతి దేవికి దక్షిణాదిన ఉన్న ఏకైక దేవాలయం ఇది. భారతదేశంలోని రెండు ప్రసిద్ధ సరస్వతి దేవాలయాలలో ఇది ఒకటి. రైళ్లు ఉంటాయి. నిజామాబాద్, నిర్మల్ నుండి బాసరకు బస్సులు, కార్లు అందుబాటులో ఉంటాయి.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు