తెలుగు న్యూస్ / ఫోటో /
Telangana Tourism : అందమైన ప్రకృతి ప్రదేశాలు.. ఆధ్యాత్మిక కేంద్రాలు.. ఖమ్మం జిల్లా ప్రత్యేకతలు
- Telangana Tourism : ఖమ్మం జిల్లా.. ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు నిలయం. ఇక్కడ చారిత్రక స్మారకాలు, అందమైన ప్రకృతి దృశ్యాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. మీరు ఖమ్మం జిల్లాను సందర్శించాలని ప్లాన్ చేసుకుంటే.. ఈ ఈ 7 ప్రముఖ పర్యాటక కేంద్రాలను లిస్టులో చేర్చుకోవచ్చు.
- Telangana Tourism : ఖమ్మం జిల్లా.. ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు నిలయం. ఇక్కడ చారిత్రక స్మారకాలు, అందమైన ప్రకృతి దృశ్యాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. మీరు ఖమ్మం జిల్లాను సందర్శించాలని ప్లాన్ చేసుకుంటే.. ఈ ఈ 7 ప్రముఖ పర్యాటక కేంద్రాలను లిస్టులో చేర్చుకోవచ్చు.
(1 / 7)
ఖమ్మం జిల్లా పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది భద్రాచలం. గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో శ్రీరామచంద్రుడు కొలువై ఉన్నారు. గోదావరి నది పక్కనే ఈ ఆలయం ఉంటుంది. అందమైన శిల్పకళ, వాస్తుశాస్త్రం ఈ ఆలయం ప్రత్యేకత. ఇక్కడి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు.
(2 / 7)
ఈ జిల్లాలో మరో చారిత్రక ప్రదేశం ఖమ్మం ఖిల్లా. చారిత్రక ప్రాముఖ్యం కలిగిన ఈ ఖిల్లా.. కాకతీయ రాజుల కాలం నాటిది. ఈ ఖిల్లా నిర్మాణం, చుట్టుపక్కల ఉన్న అడవి ప్రాంతం ప్రత్యేకంగా ఉంటుంది. వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
(3 / 7)
ఖమ్మం జిల్లాలో మరో పర్యాటక ప్రదేశం పర్ణశాల. గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ ప్రదేశం.. పచ్చని తోటలు, అందమైన ప్రకృతి దృశ్యాలకు నిలయం. ఇక్కడ బోటింగ్, పిక్నిక్ చాలా స్పెషల్. కుటుంబం, స్నేహితులతో గడపడానికి మంచి ప్లేస్ ఇది.
(4 / 7)
నేలకొండపల్లి.. బౌద్ధ స్తూపాలకు ప్రసిద్ధిగాంచింది ఈ ప్రదేశం. చారిత్రక ప్రాముఖ్యం కలిగి ఉంది. ఇక్కడ బౌద్ధుల సంస్కృతి, ఆచారాల గురించి తెలుసుకోవచ్చు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే.. నేలకొండపల్లికి వెళ్లాల్సిందే.
(5 / 7)
ఖమ్మం జిల్లాలో మరో టూరిస్ట్ స్పాట్ పాపి కొండలు. ఈ కొండలు అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. ఇక్కడ ట్రెక్కింగ్, క్యాంపింగ్ వంటి వాటిని ఆస్వాదించవచ్చు. హైదరాబాద్ నుంచి ఎక్కువమంది టూరిస్టులు ఇక్కడికి వస్తారు.
(6 / 7)
కిన్నెరసాని.. గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ ప్రదేశం.. పిక్నిక్‌కు అనువైన ప్రాంతం. ఇక్కడ పచ్చని తోటలు, అందమైన ప్రకృతి దృశ్యాలు చూడవచ్చు. పిల్లలు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎంజాయ్ చేయొచ్చు.
ఇతర గ్యాలరీలు