తెలుగు న్యూస్ / ఫోటో /
AP Tourism : సముద్ర తీరం, పచ్చటి కొండలు, పురాతన ఆలయాలు.. నెల్లూరు జిల్లా అందాలు చూడతరమా!
- AP Tourism : నెల్లూరు జిల్లా.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలకు నిలయం. సముద్ర తీరం, పచ్చటి కొండలు, పురాతన ఆలయాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలతో.. ఈ జిల్లా పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ జిల్లాలో చూడవలసిన అనేక ప్రదేశాలున్నాయి. వాటిల్లో 6 ప్రాంతాల విశేషాలు ఇలా ఉన్నాయి.

(1 / 6)
మైపాడు బీచ్.. నెల్లూరు నుండి కొద్ది దూరంలో ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం కోరుకునే పర్యాటకులు ఇక్కడికి వస్తారు. సముద్ర తీరాన నడక, స్నానం చేయడం, సూర్యాస్తమాన్ని వీక్షించడం ఇక్కడి ప్రత్యేకతలు.
(2 / 6)
పులికాట్ సరస్సు.. భారతదేశంలోని రెండో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సుగా పేరుగాంచింది. ఈ సరస్సు వలస పక్షులకు నిలయం. సరస్సు చుట్టూ ఉన్న అడవి ప్రాంతం, జీవ వైవిధ్యం పర్యాటకులను ఆకర్షిస్తాయి. బోట్ టూర్, పక్షులను చూడడం ఇక్కడ ప్రధాన ఆకర్షణలు.
(3 / 6)
శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం.. పెన్నా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. శ్రీరంగం, శ్రీరంగపట్టణం తర్వాత భారతదేశంలోని మూడో రంగనాథస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహం అత్యంత అద్భుతంగా ఉంటుంది.
(4 / 6)
వివిధ రకాల పక్షులను చూడాలనుకునే పర్యాటకులకు.. నెలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఒక అద్భుతమైన ప్రదేశం. ఈ సంరక్షణ కేంద్రంలో వందలాది రకాల పక్షులను చూడవచ్చు. ముఖ్యంగా పిల్లలు ఎంతో ఆసక్తిగా పక్షులను చూసే అవకాశం ఉంటుంది.
(5 / 6)
పెంచలకోన జలపాతం.. ప్రకృతి ప్రేమికులకు స్వర్గం. పచ్చటి కొండల మధ్య ఉన్న ఈ జలపాతం చూడడానికి అద్భుతంగా ఉంటుంది. జలపాతం దగ్గర స్నానం చేయడం, చుట్టూ ఉన్న అడవిలో తిరగడం జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది.
ఇతర గ్యాలరీలు