మద్యం తాగేవారికే ఫ్యాటీ లివర్ వస్తుందా?.. ఈ జబ్బు గురించిన అపోహలను తెలుసుకోండి!-fatty liver myths most people have these misconceptions about fatty liver know the reality here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మద్యం తాగేవారికే ఫ్యాటీ లివర్ వస్తుందా?.. ఈ జబ్బు గురించిన అపోహలను తెలుసుకోండి!

మద్యం తాగేవారికే ఫ్యాటీ లివర్ వస్తుందా?.. ఈ జబ్బు గురించిన అపోహలను తెలుసుకోండి!

Published Apr 19, 2025 07:40 PM IST Sudarshan V
Published Apr 19, 2025 07:40 PM IST

  • ఫ్యాటీ లివర్ అనే జబ్బు గురించి అనేక అపోహలు ప్రజల్లో ఉన్నాయి. వైద్యులు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఈ అపోహలు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వస్తున్నాయి. ఆ అవాస్తవాలు ఏంటో ఇక్కడ చూద్దాం..

ఆధునిక జీవనానికి తగ్గట్లుగా వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. వాటిలో ఒకటి ఫ్యాటీ లివర్. ప్రస్తుతం భారత జనాభాలో 90 శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఫ్యాటీ లివర్ చికిత్సల గురించి కొన్ని అపోహలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

(1 / 6)

అపోహ 1: ఆల్కహాల్ తాగేవారికే ఫ్యాటీ లివర్ వస్తుంది. ఆల్కహాల్ తాగే వారికి ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. అయితే, వారికి మాత్రమే ఈ జబ్బు వస్తుందన్నది అపోహ. వాస్తవానికి ఈ సమాచారం పూర్తిగా తప్పు. ఆల్కహాల్ అలవాటు లేని వారికి కూడా ఈ వ్యాధి వస్తుంది. దేశంలో 60 శాతం మంది ఫ్యాటీ లివర్ వ్యాధి గ్రస్తులకు మద్యం అలవాటు లేదు.

(2 / 6)

అపోహ 2: కూరగాయలు కాలేయాన్ని నిర్విషీకరణ చేస్తాయి: కూరగాయలు లివర్ లోని విషాన్ని తీసేస్తాయి.కాబట్టి వాటిని  ఎక్కువగా తింటే ఫ్యాటీ లివర్ తగ్గుతుంది అన్న మాట కూడా అపోహే. కూరగాయలు ఆరోగ్యానికి మంచివే కానీ, వాటివల్ల ఫ్యాటీ లివర్ తగ్గదు. నిజానికి, కాలేయానికి డిటాక్స్ ఫుడ్ అనేదే లేదు.

(3 / 6)

అపోహ 3: ఫ్యాటీ లివర్ కు మందులు లేవు.  ఫ్యాటీ లివర్ కు ఏ ఔషధాలు పని చేయవని, మందులు లేకుండా ఫ్యాటీ లివర్ నయం చేయొచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి ఇది అపోహ. ఫ్యాటీ లివర్ మొదటి దశలో ఉంటే, మందుల అవసరం లేదు. కానీ, రెండవ దశలో ఉంటే, మందులు అవసరం కావచ్చు. అయితే డాక్టర్ నిర్ణయమే అంతిమంగా ఉండాలి.

(4 / 6)

అపోహ 4: ఫ్యాటీ లివర్ చిన్న పిల్లల్లో రాదు - చిన్న పిల్లల్లో ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం ఉండదు అనేది మరో అపోహ. చాలా మంది ఫ్యాటీ లివర్ అనేది పెద్దల సమస్య అనుకుంటారు. కానీ ప్రస్తుతం ఫ్యాటీ లివర్ పిల్లల్లో కూడా కనిపిస్తోంది. పిల్లలు తీసుకుంటున్న జంక్ ఫుడ్, శారీరక శ్రమ లేని జీవన శైలి వల్ల పిల్లల్లో కూడా ఈ సమస్య వస్తోంది.

(5 / 6)

పాఠకులకు సూచన: ఈ కథనం సాధారణ పరిజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ రాసిన వాటి ఆధారంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా ప్రశ్నలను పరిష్కరించడానికి డాక్టర్ లేదా ప్రొఫెషనల్ నిపుణుడిని సంప్రదించండి.

(6 / 6)

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

ఇతర గ్యాలరీలు