(1 / 6)
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో సెంచరీ సాధించాడు. అతను 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సహాయంతో 101 పరుగులు చేశాడు. ఆర్ఆర్ ఓపెనర్ 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
(AFP)(2 / 6)
ఐపీఎల్ లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఇండియన్ ప్లేయర్ వైభవే. ఓవరాల్ ఐపీఎల్ జాబితాలో అతను రెండవ స్థానంలో ఉన్నాడు. టీ20 క్రికెట్ లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయసు ఆటగాడు కూడా అతడే.
(AFP)(3 / 6)
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు సృష్టించాడు. అతను 2013 లో పుణె వారియర్స్ పై 30 బంతుల్లో సెంచరీ సాధించాడు.
(X)(4 / 6)
భారత మాజీ ఆల్ రౌండర్ యూసుఫ్ పఠాన్ రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. ఐపీఎల్ 2010లో ముంబై ఇండియన్స్ పై యూసుఫ్ 37 బంతుల్లో సెంచరీ సాధించాడు. అప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయాడు. 14 ఏళ్ల వైభవ్ ఈ 15 ఏళ్ల కిందటి రికార్డును బద్దలు కొట్టాడు.
(X)(5 / 6)
ఐపీఎల్ 2013లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడిన డేవిడ్ మిల్లర్ 38 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఆర్సీబీపై ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఉన్న సౌతాఫ్రికా బ్యాట్స్ మన్ నాలుగో స్థానంలో ఉన్నాడు.
(BCCI)(6 / 6)
ఐపీఎల్ లో వేగవంతమైన సెంచరీల జాబితాలో ప్రియాన్ష్ ఆర్య సంయుక్తంగా 5వ స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ 39 బంతుల్లో సెంచరీ సాధించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా 39 బంతుల్లో సెంచరీ సాధించాడు. గతేడాది అతడు ఆర్సీబీపై ఈ సెంచరీ చేశాడు.
(BCCI)ఇతర గ్యాలరీలు