AP Raitu Bazars: ఏపీలో రైతు బజార్లు గాడిన పడేనా? మేలు రకం మార్కెట్లకు.. ప్రజలకేమో పుచ్చులు, నాసిరకం కూరగాయలు
- AP Raitu Bazars: ఆంధ్రప్రదేశ్ రైతు బజార్ల నిర్వహణ గాడి తప్పింది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ నిర్వహణలో ఉండే రైతు బజార్లు రాజకీయ నాయకుల గుప్పెట్లోకి జారిపోయాయి. మేలురకం, నాణ్యమైన ఉత్పత్తులు హోటళ్లకు, రిటైల్ మార్కెట్లకు తరలిపోతుంటే, నాసిరకం, సెకండ్ గ్రేడ్ సరుకును ప్రజలకు అంటగడుతున్నారు.

(2 / 9)
బయట మార్కెట్లకు తరలిపోతున్న మిర్చి, నిమ్మకాయలు, తెల్లారకముందే నాణ్యమైన ఉత్పత్తులు హోటళ్లకు తరలించేస్తున్నారు.
(3 / 9)
విజయవాడలోని అన్ని రైతు బజార్ల నుంచి కూరగాయల్ని రిటైల్ దుకాణాలకు యథేచ్ఛగా తరలిస్తున్నారు. రైతు బజార్లు మొత్తం స్థానిక ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల చేతుల్లో చిక్కుకోవడంతో అక్కడ సిబ్బంది పాత్ర నామమాత్రంగా మారింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది.
(5 / 9)
రైతు బజార్ల నుంచి ట్రేలలో తరలిస్తున్న టమాటాలు, మార్కెట్లో టమాటా ధరలు భారీగా పెరగడంతో రిటైల్ మార్కెట్లకు వాటిని తరలించేస్తున్నారు.
(7 / 9)
బీన్స్, క్యాప్సికం, క్యారెట్, బీట్ రూట్, క్యాబేజీలలో నాణ్యమైన సరుకు మొదట బయట మార్కెట్లకే తరలిస్తారు.
(8 / 9)
రైతు బజార్లలో నిల్వ ఉండి, పండిపోయిన రకం టమాటాలు మాత్రమే సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. తాజా కాయల్ని ఇతర మార్కెట్లకు తరలిస్తున్నారు.
ఇతర గ్యాలరీలు