మొన్న ఏపీ... ఇవాళ తెలంగాణ..! బీఆర్ఎస్ సభలో 'రప్పా రప్పా' డైలాగ్ పోస్టర్లు-farmers dharna for rythu bharosa funds at patancheru pushpa movie dialogue posters appeared ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మొన్న ఏపీ... ఇవాళ తెలంగాణ..! బీఆర్ఎస్ సభలో 'రప్పా రప్పా' డైలాగ్ పోస్టర్లు

మొన్న ఏపీ... ఇవాళ తెలంగాణ..! బీఆర్ఎస్ సభలో 'రప్పా రప్పా' డైలాగ్ పోస్టర్లు

Published Jun 21, 2025 05:26 PM IST Maheshwaram Mahendra Chary
Published Jun 21, 2025 05:26 PM IST

పుష్పా మూవీ డైలాగ్ పొలిటికల్ హీట్ ను పుట్టిస్తోంది. ఇటీవలే వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో 'రప్పా రప్పా' అనే డైలాగ్ తో కూడిన పోస్టర్ తెగ వైరల్ అయింది. అంతేకాదు ఈ వ్యవహారంపై ఏపీ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే తాజాగా తెలంగాణలో కూడా ఇదే మాదిరి పోస్టర్లు కనిపించాయి.

పుష్పా మూవీ డైలాగ్ పొలిటికల్ హీట్ ను పుట్టిస్తోంది. జగన్ పల్నాడు పర్యటనలో పోస్టర్లు కనిపించటంతో…. ప్రధాన పార్టీల మధ్య పెద్ద డైలాగ్ వార్ నడుస్తోంది. పోస్టర్లు ప్రదర్శించిన వ్యక్తిపై కేసులు కూడా నమోదు చేశారు. అయితే తాజాగా  మాజీ మంత్రి హరీశ్ రావు సభలో కూడా పుష్ప డైలాగ్ పోస్టర్ దర్శనమిచ్చింది.

(1 / 5)

పుష్ప సినిమాలోని ‘రప్పా రప్పా’ అనే డైలాగ్ రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు, అంతేకాదు 3.0 లోడింగ్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ పోస్టర్లు పటాన్‌చెరులో నిర్వహించిన రైతు ధర్నాలో  కనిపించాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(2 / 5)

సంగారెడ్డి జిల్లాలో రైతు భరోసా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో జిన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మహాధర్నా కార్యక్రమం జరిగింది. ఇందులో మాజీ మంత్రి హరీశ్ రావ్ మాట్లాడారు.

(3 / 5)

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ…. “రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు భరోసా ఇస్తామంటూ.. పటాన్ చెరు, మేడ్చల్ వారికి ఇవ్వకపోవడం దారుణం. రెండు లక్షలమంది పైగా రైతులను అన్యాయం చేస్తూ.. అర్హులైన వారికి పించన్లకోత, అన్ని పథకాలలో కోతలు పెట్టి ఎగవేత పెట్టిన రేవంత్ రెడ్డిని విడిచేది లేదు. బీఆర్ఎస్ హాయంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చాం.. రేవంత్ రెడ్డి హయాంలో విద్యుత్ కోతలు తప్పడం లేదు. రైతు బంధు ఎగవేత దారుణం, రైతులకు బాకీ పడ్డ పైసలు ఇవ్వకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓట్ల రూపంలో వాతలు పెడతరు” అంటూ విమర్శలు గుప్పించారు.

(4 / 5)

“రైతు భరోసా రాని రెండు లక్షల మంది రింగురోడ్డు ఎక్కి ఉద్యమిస్తే రేవంత్ రెడ్డి గుండెలు అదరాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పరువును తీస్తున్నాడు, బనకచర్ల ఏడుందో ముఖ్యమంత్రికి తెలియకపోవడం సిగ్గుచేటు.  రేవంత్ రెడ్డి తప్పులను ఎత్తి చూపించినందుకు ఓర్వలేక కౌశిక్ రెడ్డిని రాత్రికి రాత్రి అక్రమ కేసుల్లో ఇరికించారు. కేసీఆర్, కేటీఆర్ లపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టుడు తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదు. రైతులకు న్యాయం జరిగేంత వరకు బిఆర్ఎస్ పోరాటం చేస్తుంది” అని హరీశ్ రావ్ స్పష్టం చేశారు.

(5 / 5)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు