Faria Abdullah: జాతిరత్నాలు బ్యూటీ కొత్త టాలెంట్ - బ్లాక్‌బస్టర్ సీక్వెల్ కోసం లిరిసిస్ట్‌గా మారిన ఫరియా అబ్దుల్లా
టాలీవుడ్‌లో చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయాన్ని సాధించిన మత్తు వదలరా మూవీకి సీక్వెల్ రాబోతోంది. మత్తు వదలరా 2 పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ సెప్టెంబర్ 13న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది.
(1 / 5)
కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న మత్తు వదలరా 2 మూవీలో ఫరియా అబ్దుల్లా ఓ స్పెషల్ ఏజెంట్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నది. ఈ సీక్వెల్‌లో గన్స్‌తో కొన్ని స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌లు చేసినట్లు ఫరియా అబ్దుల్లా చెప్పింది.
(2 / 5)
మత్తు వదలరా 2 కోసం లిరిసిస్ట్‌గా మారింది ఫరియా అబ్దుల్లా. సినిమాలోని ఓ పాటను రాయడమే కాకుండా స్వయంగా తానే ఈ పాటను పాడింది. అంతే కాకుండా ఈ పాటు కొరియోగ్రఫీ కూడా ఫరియా అబ్దుల్లానే అందించడం గమనార్హం.
(3 / 5)
ప్రభాస్ కల్కిలో చిన్న రోల్ చేయడం ఆనందంగా ఉందని ఫరియా అబ్దుల్లా అన్నది. ఫ్రభాస్ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు మత్తువదలరా 2 ప్రమోషన్స్‌లో చెప్పింది.
(4 / 5)
మత్తు వదలరా 2లో కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా నటిస్తోండగా...సత్య, సునీల్, వెన్నెలకిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇతర గ్యాలరీలు