Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్ బెస్ట్ తమిళ థ్రిల్లర్ మూవీస్ ఇవే - తెలుగులో ఈ సినిమాలను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
Aishwarya Rajesh: సంక్రాంతికి వస్తున్నాం మూవీతో కెరీర్‌లోనే పెద్ద హిట్‌ను అందుకున్నది ఐశ్వర్య రాజేష్. వెంకటేష్ హీరోగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ మూడు వందల కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. టాలీవుడ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.
(1 / 6)
అచ్చ తెలుగు అమ్మాయి అయిన ఐశ్వర్య రాజేష్ తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేసింది. ఆమె హీరోయిన్‌గా నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి.
(2 / 6)
డ్రైవర్ జమున మూవీలో ఐశ్వర్య రాజేష్ క్యాబ్ డ్రైవర్‌గా ఛాలెంజింగ్ రోల్ చేసింది. ఈ థ్రిల్లర్ మూవీ తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో చూడొచ్చు.
(3 / 6)
ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించిన తమిళ హారర్ మూవీ భూమిక తెలుగులో అదే టైటిల్‌తో డబ్ అయ్యింది. తెలుగు వెర్షన్ డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
(4 / 6)
ఐశ్వర్య రాజేష్, ఆర్‌జే బాలాజీ ప్రధాన పాత్రలు పోషించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ డ్రైవర్ జమున డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఐదు భాషల్లో అందుబాటులో ఉంది. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌లతో సాగే ఈ మూవీ థియేటర్లలో కమర్షియల్ హిట్‌గా నిలిచింది.
(5 / 6)
తమిళ థ్రిల్లర్ మూవీ ఫర్హానా కమర్షియల్ సక్సెస్‌తో పాలు పలు అవార్డులను అందుకున్నది. ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్‌లో నటించిన ఈ మూవీకి నెల్సన్ వెంకటేష్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తెలుగులో సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇతర గ్యాలరీలు