(1 / 6)
ఈ సినిమాకు యాపిల్ సంస్థ కెమెరాలు ఇచ్చింది. ఫార్ములా కార్కి చెందిన హై-క్వాలిటీ వీడియోలు తీయడం చాలా కష్టం. ఇందుకోసం యాపిల్ ఇంజినీరింగ్ టీమ్ కస్టమైజ్డ్ కెమెరాలను రూపొందించింది. స్టాండర్డ్ ఎఫ్1 బ్రాడ్‌క్యాస్ట్ కెమెరాల మాదిరిగానే ఈ కెమెరాల డైమెన్షన్స్, షేప్, బరువు ఉంటాయి. ఏ17 ప్రో చిప్సెట్ ఈ కెమెరాల్లో ఉన్నాయి.
(2 / 6)
బ్రాడ్ పిట్ నటించిన ఈ F1 సినిమాని రియల్ లైఫ్ రేస్‌ల మధ్యలో తీశారు. ఇందుకోసం బ్రాడ్ పిట్ రియల్ ఫార్ములా 1 డ్రైవర్లతో పోటీ పడాల్సి వచ్చింది.
(3 / 6)
సినిమాలో మోటార్ రేసింగ్ యాక్షన్‌ని చిత్రీకరించేందుకు సోనీ ఎలక్ట్రానిక్స్ రైయాల్టో సిస్టెమ్ని డిజైన్ చేసింది. ఇది ఎఫ్1 కారు లోపలి దృశ్యాలను చిత్రీకరించేందుకు బాగా ఉపయోగపడింది. ఫీలింగ్స్‌ని బాగా క్యాప్చర్ చేయగలిగింది. దీని కోసం చాలా రిసెర్చ్ జరిగింది.
(4 / 6)
ఎఫ్1 సినిమాలో నటించిన వారు నిజంగా రేసింగ్ చేశారు. రేసింగ్ దృశ్యాలు గ్రాఫిక్స్ కావు! బ్రాడ్ పిట్, కో- స్టార్ డామ్సన్లు రేసింగ్ కారులో డ్రైవ్ చేశారు. అయితే, ఇవి నిజమైన ఫార్ముల 1 కార్లు కావు. ఫార్ములా 2 కార్లు.
(5 / 6)
మూవీ ట్రైలర్ మరో హైలైట్! యాపిల్ సంస్థ తొలి హ్యాప్టిక్ మూవీ ట్రైలర్‌ని రూపొందించింది. ఐఓఎస్ 18.4 దానికన్నా ఎక్కువ సాఫ్ట్వేర్ ఉన్న ఐఫోన్స్‌లో ట్రైలర్‌ని చూసినప్పుడు ఇంజిన్ రోర్కి ఫోన్ బజ్ అవుతుంది. ఫార్ములా కారు రేసింగ్ ఫీలింగ్‌ని ఇస్తుంది.
(6 / 6)
బ్రాడ్ పిట్ నటించిన ఈ F1 సినిమాకి విపరీతమైన క్రేజ్ కనిపిస్తోంది. ఒక్క ఇండియన్ బాక్సాఫీస్ దగ్గరే మొదటి రెండు రోజుల్లో రూ. 15.12 కోట్లు కొళ్లగొట్టింది. అంతర్జాతీయంగా 140 మిలియన్లు దాటేసి ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు