
(1 / 5)
పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియా ఆనంద్, టోవినో థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ మూవీ ఎజ్రా అదే పేరుతో తెలుగులో యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లోల ఈ మూవీ యాభై కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

(2 / 5)
టోవినో థామస్ హీరోగా నటించిన మలయాళం హారర్ మూవీ నీలవెలిచామ్ తెలుగులో భార్గవి నిలయం పేరుతో డబ్ అయ్యింది. ఓ ఆత్మ ప్రతీకారం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీని యూట్యూబ్‌లో తెలుగులో చూడొచ్చు.

(3 / 5)
పృథ్వీరాజ్ సుకుమార్ హీరోగా నటించిన కోల్డ్ కేస్ డిఫరెంట్ హారర్ మూవీగా ఆడియెన్స్‌ను మెప్పించింది. ఓ మర్డర్ కేసు చుట్టూ సాగే మూవీ ఇది. ఈ సినిమా తెలుగు వెర్షన్ యూట్యూబ్‌లో రెండు మిలియన్లకుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకున్నది.

(4 / 5)
ప్రేతం 2 మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. జయసూర్య హీరోగా నటించిన ఈ మూవీ తెలుగులో అదే పేరుతో డబ్ అయ్యింది. తెలుగు వెర్షన్ యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. నవ్విస్తూనే ఈ మూవీ భయపెడుతుంది

(5 / 5)
కుంచకోబోబన్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన నీడ మూవీ యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌లతో నీడ సాగుతుంది.
ఇతర గ్యాలరీలు