AP TS Weather Updates : తెలంగాణకు IMD చల్లని కబురు - ఆ తేదీ తర్వాత తేలికపాటి వర్షాలు..!-expected light to moderate rainfall in coastal andhra today imd latest weather updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Expected Light To Moderate Rainfall In Coastal Andhra Today Imd Latest Weather Updates Check Here

AP TS Weather Updates : తెలంగాణకు IMD చల్లని కబురు - ఆ తేదీ తర్వాత తేలికపాటి వర్షాలు..!

Mar 13, 2024, 10:35 AM IST Maheshwaram Mahendra Chary
Mar 13, 2024, 10:35 AM , IST

  • AP Telangana Weather Updates : ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు పెరిగిపోతున్నాయి. మార్చి నెలలోనే జనాలు చుక్కలు చూస్తున్నారు. ఏపీలోని దక్షిణ కోస్తా, సీమ జిల్లాలో ఎండలు ఉండగా… ఉత్తర కోస్తాలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ లో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా సీమ జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

(1 / 7)

ఆంధ్రప్రదేశ్ లో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా సీమ జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.(/unsplash.com)

నిన్నటి ఐఎండీ రిపోర్టు(మార్చి 12) ప్రకారం..అనంతపురంలో 39.7 డిగ్రీలు, కర్నూలులో - 39.1, నంద్యాలలో 39.2, కడపలో 37.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

(2 / 7)

నిన్నటి ఐఎండీ రిపోర్టు(మార్చి 12) ప్రకారం..అనంతపురంలో 39.7 డిగ్రీలు, కర్నూలులో - 39.1, నంద్యాలలో 39.2, కడపలో 37.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.(/unsplash.com)

ఓవైపు ఎండలు దంచికొడుతుండగా... ఏపీలోని ఉత్తర కోస్తాకు మాత్రం చల్లని కబురు చెప్పింది వాతావరణశాఖ. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని  వెల్లడించింది. 

(3 / 7)

ఓవైపు ఎండలు దంచికొడుతుండగా... ఏపీలోని ఉత్తర కోస్తాకు మాత్రం చల్లని కబురు చెప్పింది వాతావరణశాఖ. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని  వెల్లడించింది. (/unsplash.com)

దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని ఐఎండీ తెలిపింది.  సీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది

(4 / 7)

దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని ఐఎండీ తెలిపింది.  సీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది(/unsplash.com)

తెలంగాణలో చూస్తే… ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది.

(5 / 7)

తెలంగాణలో చూస్తే… ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది.(/unsplash.com)

హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం… నిన్న(మార్చి 12)  ఆదిలాబాద్ లో 39.3, మెదక్ - 38.6, నిజామాబాద్ 39.3, రామగుండం - 37.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

(6 / 7)

హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం… నిన్న(మార్చి 12)  ఆదిలాబాద్ లో 39.3, మెదక్ - 38.6, నిజామాబాద్ 39.3, రామగుండం - 37.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. (unsplash.com/)

తెలంగాణలో మార్చి 18వ తేదీ వరకు పొడి వాతవరణం ఉంటుందని తెలిపిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం... మార్చి 19 నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడకక్కడ కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేసింది.

(7 / 7)

తెలంగాణలో మార్చి 18వ తేదీ వరకు పొడి వాతవరణం ఉంటుందని తెలిపిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం... మార్చి 19 నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడకక్కడ కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేసింది.

ఇతర గ్యాలరీలు