తెలుగు న్యూస్ / ఫోటో /
US President Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ గ్రామంలో ఉత్కంఠ, ఉపాధ్యక్ష రేసులో వడ్లూరు అల్లుడు..
- US President Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని రిపబ్లికన్ పార్టీ తరపున ఉపాధ్యక్ష రేసులో ఉన్న వాన్స్ సతీమణి ఉషా మూలాలు వడ్లూరులో ఉండటంతో వారు రిపబ్లికన్ పార్టీ విజయాన్ని కాంక్షిస్తున్నారు.
- US President Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని రిపబ్లికన్ పార్టీ తరపున ఉపాధ్యక్ష రేసులో ఉన్న వాన్స్ సతీమణి ఉషా మూలాలు వడ్లూరులో ఉండటంతో వారు రిపబ్లికన్ పార్టీ విజయాన్ని కాంక్షిస్తున్నారు.
(1 / 9)
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా వాసులు ఆసక్తిగా గమనిస్తున్నారు, US సెనేటర్ మరియు రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి J.D. వాన్స్ భార్య ఉషా వాన్స్ తల్లిదండ్రుల పూర్వీకుల గ్రామమైన వడ్లూరులో చిలుకూరి కుటుంబీకులు, బంధువులు ఉన్నారు.(AFP)
(2 / 9)
రిపబ్లికన్ పార్టీ తరపున ఉపాధ్యక్షుడి పదవికి రేసులో ఉన్న జేడీ వాన్స్ సతీమణి చిలుకూరి ఉషా కుటుంబం వడ్లూరు నుంచి అమెరికాలో స్థిరపడింది. ఉషా తల్లిదండ్రులు 60వ దశకంలోనే అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుత ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా వాన్స్ పోటీ పడుతున్నారు. డెమోక్రాట్ల తరపున పోటీ చేస్తున్న కమలాహారిస్ పూర్వీకులు కూడా తమిళనాడు ప్రాంతానికి చెందిన వారే.(AFP)
(3 / 9)
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై వడ్లూరు గ్రామ ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొంది చిలుకూరి కుటుంబానికి చెందిన బంధువులు ఇప్పటికీ ఆ గ్రామంలో ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్ష రేసులో విజయం దిశగా రిపబ్లికన్ పార్టీ పయనిస్తుండటంపై గ్రామంలో సందడి నెలకొంది. (AFP)
(4 / 9)
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని వడ్లూరు గ్రామానికి చెందిన చిలుకూరి ఉషా తల్లిదండ్రులు చాలా కాలం క్రితమే అమెరికాలో స్థిరపడ్డారు. ఉషా అమెరికాకు చెందిన జేడీ వాన్స్‌ను వివాహం చేసుకున్నారు. తాజా ఎన్నికల్లో ఆయన రిపబ్లికన్ పార్టీ తరపున ఉపాధ్యక్ష బరిలో ఉన్నారు. (AFP)
(5 / 9)
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల సరళిని వడ్లూరు గ్రామస్తులు సైతం ఆసక్తిగా గమనిస్తున్నారు. (AFP)
(6 / 9)
పశ్చిమగోదావరి జిల్లాలోని మారుమూల గ్రామమైన వడ్లూరు నుంచి అమెరికాకు వలస వెళ్లిన కుటుంబానికి చెందిన వ్యక్తిఆ దేశ ఉపాధ్యక్షుడిగా ఎన్నికవుతుండటంతో గ్రామంలో ఉత్సాహం నెలకొంది(AFP)
(7 / 9)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో విజయం ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠ వడ్లూరు వాసుల్లో కనిపించింది. (AFP)
ఇతర గ్యాలరీలు