
(1 / 6)
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుక కంకిపాడు అయానా కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది.

(2 / 6)
విజయవాడ నగర శివారులోని కంకిపాడులో జరిగిన దేవినేని కుమారుడి వివాహ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యరు.

(3 / 6)
ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్ తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యనేతలు వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. నూతన వధూవరులు నిహార్, సాయి నర్మదలను ఆశీర్వదించారు.

(4 / 6)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ మంత్రి నారా లోకేశ్

(5 / 6)
విజయవాడలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

(6 / 6)
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి విజయవాడ వచ్చిన రేవంత్‌రెడ్డికి హెలిప్యాడ్ వద్ద ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌రెడ్డి స్వాగతం పలికారు.
ఇతర గ్యాలరీలు