YS Jagan : పవన్ కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ-సూపర్ 6 హామీలపై వైఎస్ జగన్ ప్రశ్నలు, పంచ్ లు-ex cm ys jagan criticizes pawan more for corporator list for mla questions super 6 promises ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ys Jagan : పవన్ కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ-సూపర్ 6 హామీలపై వైఎస్ జగన్ ప్రశ్నలు, పంచ్ లు

YS Jagan : పవన్ కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ-సూపర్ 6 హామీలపై వైఎస్ జగన్ ప్రశ్నలు, పంచ్ లు

Published Mar 05, 2025 02:59 PM IST Bandaru Satyaprasad
Published Mar 05, 2025 02:59 PM IST

YS Jagan : మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై ప్రశ్నలు ఎక్కుపెట్టారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై పంచులు పేల్చారు. సూపర్-6 పథకాలకు బడ్జెట్ లో నిధులు కేటాయించలేదని ఇదేనా మంచి ప్రభుత్వం అంటూ ప్రశ్నలు సంధించారు.

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్...కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సూపర్-6 హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ప్రతిపక్ష హోదా రాదన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన జగన్..."పవన్ కల్యాణ్ కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు" అని ఎద్దేవా చేశారు. 

(1 / 7)

తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీలపై ప్రశ్నలు సంధించారు. "సూపర్-6 హామీల అమలుకు ఈ ఏడాదికి రూ.79,867 కోట్లు అవసరం. కానీ బడ్జెట్ లో సీఎం చంద్రబాబు కేటాయించింది రూ.17,179 కోట్లు మాత్రమే. అంటే ఈ సంవత్సరం కూడా హామీలను ఎగ్గొట్టాలనే కదా చంద్రబాబు ప్లాన్" అని విమర్శించారు.  

(2 / 7)

ఫ్రీ బస్సు.. ఫ్రీ బస్సు అని ఊదరగొట్టి మహిళలతో ఓట్లేయించుకున్నారని వైఎస్ జగన్ అన్నారు. గెలిచాక బడ్జెట్ లో ఉచిత బస్సు పథకానికి కనీసం పావలా కూడా కేటాయించకుండా మహిళలను మోసం చేశారన్నారు. చంద్రబాబు నమ్మితే ఇదే గతి అని ఈ జనరేషన్ మహిళలకు సైతం అర్థమైందన్నారు. 

(3 / 7)

మహిళలకు ఏటా మూడు సిలిండర్లు ఫ్రీ అని కూటమి పార్టీలు గ్యాస్ కబుర్లు చెప్పారని వైఎస్ జగన్ విమర్శించారు. ఈ పథకానికి ఏటా రూ. 4000 కోట్లు కావాలి కానీ కేవలం రూ. 865 కోట్లు కేటాయించి ఇంతే ఉంది సర్దుకుపోండని సుద్దపూస కబుర్లు చెబుతున్నారన్నారు.  

(4 / 7)

నిరుద్యోగులను నమ్మించి మరోసారి ఎగనామం పెట్టారని వైఎస్ జగన్ మండిపడ్డారు. 20 లక్షల ఉద్యోగాలు, ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నారని 10 నెలలుగా ఉద్యోగాల్లేవ్.. భృతి లేదు. ఇదేనా మంచి ప్రభుత్వం అంటూ కూటమి ప్రభుత్వంపై జగన్ విరుచుకుపడ్డారు.   

(5 / 7)

"ఆడబిడ్డ నిధి కింద ప్రతినెలా రూ. 1500 ఇస్తామని నమ్మించారు. ఏటా రూ. 18,000 చొప్పున ఇవ్వాల్సి ఉంది కానీ దీనికి బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా మోసం చేశారు. జనాన్ని ఎలా నమ్మించాలో చంద్రబాబుకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. అందుకే సరిగ్గా ప్రజల బలహీనతమీద వ్యాపారం చేస్తూ బతికేస్తున్నారు"- వైఎస్ జగన్ 

(6 / 7)

"జగన్ ఉన్నప్పుడు కనీసం పలావ్ పెట్టాడు. చంద్రబాబు బిర్యానీ పెడతారని ఆశపడ్డారు. కానీ ఇప్పుడు పలావ్ పోయింది, చంద్రబాబు బిర్యానీ కూడా మోసంగా మారింది" అని వైఎస్  జగన్ ఎద్దేవా చేశారు.  

(7 / 7)

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు