Telangana Govt : తెలంగాణ ప్రజలకు శుభవార్త - త్వరలోనే కొత్త స్కీమ్, ప్రతి పౌరుడికి హెల్త్ కార్డు..!
- TG Govt Health Profile Card : ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డును ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
- TG Govt Health Profile Card : ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డును ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
(1 / 6)
ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డును ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ స్కీమ్ ను త్వరలోనే పట్టాలెక్కించే యోచనలో ఉంది.
(2 / 6)
ఇదే స్కీమ్ అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ వేదికగా స్పష్టమైన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్ కార్డు జారీ చేస్తామని తెలిపారు. బ్లడ్ గ్రూప్ నుంచి మొదలుకొని వారికున్న ఆరోగ్య సమస్యలను సేకరించి హెల్త్ ప్రొఫైల్ కార్డును తయారు చేస్తామని పేర్కొన్నారు.
(3 / 6)
డిజిటల్ హెల్త్ కార్డుతోవైద్యం సులభంగా అందించవచ్చని చెప్పారు. ఏదైనా ఆస్పత్రికి వెళ్తే ఈ డిజిటల్ కార్డు చూపిస్తే… గతంలో ఉన్న సమస్యలతో పాటు పూర్తి వివరాలను ఆస్పత్రి వైద్యులు తెలుసుకునేలా ఉంటుందని వివరించారు.
(4 / 6)
ఈ స్కీమ్ ను అతి త్వరలోనే అమలు చేయబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ దిశగా వైద్యారోగ్య శాఖ పని చేస్తుందని చెప్పుకొచ్చారు.
(5 / 6)
తెలంగాణను మెడికల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామని ఇదే సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నారు. శంషాబాద్‌లో వెయ్యి ఎకరాల్లో మెడికల్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు.
ఇతర గ్యాలరీలు