300 score: 300 కొట్టినా కష్టమే.. వన్డేల్లో రెచ్చిపోతున్న జట్లు.. ఛాంపియన్స్ ట్రోఫీలో దబిడి దిబిడే
300 score: ప్రస్తుతం వన్డేల్లో 300 స్కోరు అనేది కామన్ గా మారిపోయింది. 300 కొట్టినా గెలుపు గ్యారెంటీ అని చెప్పలేని పరిస్థితి. జట్లు భారీ స్కోర్లపై కన్నేస్తున్నాయి. రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో రికార్డులు బద్దలవడం ఖాయమే.
(1 / 5)
తాజాగా పాకిస్థాన్ లో జరుగుతున్న ట్రై సిరీస్ లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు చెలరేగిపోయింది. మొదట దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 304 పరుగులు చేసింది. అంత స్కోరు చేసింది కాబట్టి ఆ జట్టుదే విజయమనే అంచనాలు కలిగాయి. కానీ కేన్ విలియమ్సన్ (133 నాటౌట్), కాన్వే (97) విధ్వంసంతో కివీస్ మరో 8 బంతులు ఉండగానే గెలిచింది.
(AFP)(2 / 5)
ఇంగ్లండ్ తో కటక్ లో జరిగిన రెండో వన్డేలో భారత్ కూడా ఛేదనలో చెలరేగిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 304 పరుగులు చేయడంతో ఛేజింగ్ లో టీమ్ఇండియా కష్టమవుతుందేమో అనిపించింది. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ (119) సెన్సేషనల్ సెంచరీకి తోడు గిల్ (60) కూడా మెరవడంతో 44.3 ఓవర్లలోనే భారత్ మ్యాచ్ ముగించింది.
(AFP)(3 / 5)
2023 వన్డే ప్రపంచకప్ లో అయితే జట్లు అలవోకగా 300 పరుగులు సాధించేశాయ్. భారత్ లో జరిగిన ఆ ప్రపంచకప్ లో 21 ఇన్నింగ్స్ ల్లో 300 కు పైగా పరుగులు నమోదయ్యాయి. ఇందులో 3 సార్లు 400 కు పైగా జట్లు స్కోర్లు చేయడం విశేషం. 2 ఇన్నింగ్స్ ల్లో 399 పరుగుల చొప్పున జట్లు ఖాతాలో వేసుకున్నాయి.
(x/bcci)(4 / 5)
గత అయిదారేళ్లుగా వన్డేల్లో బ్యాటర్ల ఆధిపత్యం పెరగడం, ఫీల్డింగ్ నిబంధనలు, రెండు కొత్త బంతులు, బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్ లు.. ఇలాంటి కారణాల వల్ల భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. అలవోకగా 300 స్కోరుబోర్డు మీద చేరుతుంది. వన్డేల్లోనూ టీ20 ఆటతీరుతో జట్లు అదరగొడుతున్నాయి. ముఖ్యంగా భారత్,దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి జట్లు పరుగుల వేటలో దూసుకెళ్తున్నాయి.
(AFP)(5 / 5)
వన్డేల్లో భారీ స్కోర్ల నేపథ్యంలో రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ పరుగుల వరద పారడం ఖాయమనిపిస్తోంది. 300 ను దాటేసి జట్లు 400 స్కోరుపై కన్నేస్తున్నాయి. పైగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిచ్చే పాక్ లోని కరాచి స్టేడియం, గడాఫీ స్టేడియం, రావల్పిండి స్డేడియాలు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక భారత్ మ్యాచ్ లు ఆడే దుబాయ్ స్టేడియం పిచ్ కాస్త స్లో గా ఉన్నప్పటికీ పరుగుల విందుకు ఢోకా ఉండకపోవచ్చు.
(x/Saj Sadiq)ఇతర గ్యాలరీలు