(1 / 7)
తెలంగాణలో మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాగా… మార్చి 25వ తేదీతో అన్ని ముగిశాయి. మొత్తం 1,532 కేంద్రాల్లో ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈసారి జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు 9 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు.
(2 / 7)
ఇంటర్ పరీక్షలు ముగియగా… మరోవైపు జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 10వ తేదీ నుంచి ఈ ప్రాసెస్ ను ప్రారంభించగా…. మొత్తం 4 విడతల్లో స్పాట్ ను పూర్తి చేయనున్నారు
(3 / 7)
మార్చి 10 నుంచి సంస్కృతం పేపర్ I, II తో మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించగా… ఆ తర్వాత… ఇంగ్లీష్, తెలుగు, హిందీ, గణితం, సివిక్స్ పత్రాలను మూల్యాంకనం చేశారు. ఈ ప్రక్రియ మార్చి 22వ తేదీతో పూర్తయింది. మార్చి 24 నుంచి సెకండ్ స్పెల్ స్పాట్ ప్రారంభమైంది. ఇందులో ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్ - I మరియు II మూల్యాంకనం చేస్తున్నారు.
(4 / 7)
మార్చి 26 నుంచి మూడవ స్పెల్ ఉంటుంది. ఇందులో కెమిస్ట్రీ, కామర్స్ I మరియు II పేపర్‌ల మూల్యాంకనం చేస్తారు. చివరగా మార్చి 28వ తేదీ నుంచి హిస్టరీ పేపర్ I, II వృక్షశాస్త్రం, జంతుశాస్త్ర సమాధాన పత్రాలను మూల్యాంకనం ఉంటుంది. దీంతో తెలంగాణ ఇంటర్ పరీక్షల స్పాట్ పూర్తవుతుంది.
(5 / 7)
పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా జవాబు పత్రాలను పరిశీలించిన తర్వాతే... మార్కులను ఎంట్రీ చేస్తారు. వాల్యూయేషన్ ప్రక్రియను మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యాశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే… ఫలితాలను ప్రకటిస్తారు.
(6 / 7)
ఈసారి రాష్ట్రంలో స్పాట్ ఎవాల్యుయేషన్ కేంద్రాల సంఖ్యను పెంచారు. గతేడాది 17 మాత్రమే ఉండగా.. ఈసారి 19కి పెంచారు. జవాబు పత్రాలను దిద్దేందుకు 14,000 మంది విధుల్లో ఉంటారు ఒక్కో లెక్చరర్ ఒక్కో రోజు 40 జవాబు పత్రాల చొప్పున చూడాల్సి ఉంటుంది. గత ఏడాదితో పోల్చితే.. ఈసారి సాధ్యమైనంత త్వరగా ఫలితాల విడుదల ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది. ఈఏపీసెట్ తో పాటు ఇతర పరీక్షల దృష్ట్యా.... వీలైనంత త్వరగా వాల్యూయేషన్ తో పాటు మార్కుల ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు చూస్తోంది.
(7 / 7)
గతేడాది(2024) మార్చి 19 నాటికి ఇంటర్ పరీక్షలు పూర్తికాగా.. ఏప్రిల్ 24న ఫలితాలు విడుదల చేశారు. ఈసారి మార్చి 25వ తేదీతో పరీక్షలు పూర్తయ్యాయి. అయితే ఈసారి ఏప్రిల్ 29వ తేదీ నుంచి ఎప్‌సెట్(TG EAPCET 2025) ప్రారంభం కానుంది. దీంతో ఈ పరీక్షలు ప్రారంభమయ్యేలోపే ఇంటర్ పరీక్షలు ప్రకటించాలని బోర్డు భావిస్తోంది. గతేడాది మాదిరిగానే ఏప్రిల్ నెలఖారులోపే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ ఇంటర్ బోర్డు వెబ్ సైట్ తో పాటు HT తెలుగు వెబ్ సైట్ లో కూడా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఇతర గ్యాలరీలు