(1 / 5)
England Final XI for 2nd T20: టీమిండియాతో తొలి టీ20లో ఏడు వికెట్లతో ఓడిన ఇంగ్లండ్ టీమ్.. రెండో టీ20కి ఒక రోజు ముందే తుది జట్టును ప్రకటించింది. పేస్ బౌలర్ గస్ అట్కిన్సన్ స్థానంలో బ్రైడన్ కార్స్ ను తీసుకుంది. ఇక గాయపడిన జాకబ్ బెతెల్ కు బ్యాకప్ గా జేమీ స్మిత్ ను కూడా ఎంపిక చేశారు.
(AFP)(2 / 5)
England Final XI for 2nd T20: ఇంగ్లండ్ ఆల్ రౌండర్ జాకబ్ బెతెల్ అనారోగ్యానికి గురయ్యాడు. అయితే అతన్ని రెండో టీ20కి ఇంగ్లండ్ టీమ్ ఎంపిక చేసింది. మ్యాచ్ రోజు ఉదయం అతనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. జేమీ స్మిత్ తో కలిపి 12 మందితో కూడిన జట్టును ప్రకటించారు.
(AFP)(3 / 5)
England Final XI for 2nd T20: ఇక తొలి టీ20లో రాణించని గస్ అట్కిన్సన్ స్థానంలో బ్రైడన్ కార్సేను ఎంపిక చేశారు. అటు బెతెల్ ఆడకపోతే జేమీ స్మిత్ వికెట్ కీపింగ్ చేయనున్నాడు.
(PTI)(4 / 5)
England Final XI for 2nd T20: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో శనివారం (జనవరి 25) ఇండియా, ఇంగ్లండ్ రెండో టీ20 జరగనుంది. ఇంగ్లండ్ టీమ్ లో జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, లియామ్ లివింగ్‌స్టన్, జాకబ్ బెతెల్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, జామీ స్మిత్ ఉన్నారు.
(PTI)(5 / 5)
England Final XI for 2nd T20: ఐదు టీ20ల సిరీస్ లో తొలి మ్యాచ్ ను 7 వికెట్లతో గెలిచి 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది టీమిండియా. ఇక ఇప్పుడు ఒత్తిడి ఇంగ్లండ్ పైనే ఉంది. చెన్నైలో గెలిచి సిరీస్ సమం చేయాలని ఆ టీమ్ భావిస్తోంది.
(PTI)ఇతర గ్యాలరీలు