Harry Brook: కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన ఇంగ్లండ్ స్టార్ హ్యారీ బ్రూక్: వివరాలివే
- Harry Brook - Virat Kohli: ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో వన్డేలో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ అర్ధ శతకంతో దుమ్మురేపాడు. ఈ సిరీస్‍లో అదరగొట్టిన బ్రూక్.. భారత స్టార్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఓ రికార్డును బ్రేక్ చేశాడు.
- Harry Brook - Virat Kohli: ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో వన్డేలో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ అర్ధ శతకంతో దుమ్మురేపాడు. ఈ సిరీస్‍లో అదరగొట్టిన బ్రూక్.. భారత స్టార్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఓ రికార్డును బ్రేక్ చేశాడు.
(1 / 5)
ఆస్ట్రేలియాపై ఐదో వన్డేలో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. దీంతో సొంతగడ్డపై జరిగిన ఐదు వన్డేల సిరీస్‍ను 2-3తో కోల్పోయింది. అయితే, ఆదివారం (సెప్టెంబర్ 29) జరిగిన ఐదో వన్డేలో ఇంగ్లండ్ యంగ్ స్టార్ బ్యాటర్, కెప్టెన్ హ్యారీ బ్రూక్ అర్ధ శతకంతో రాణించాడు. దీంతో ఓ రికార్డు విషయంలో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని అధిగమించాడు.
(2 / 5)
ఐదో వన్డేలో బ్రూక్ 52 బంతుల్లో 72 పరుగులతో రాణించాడు. 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో దూకుడు చూపాడు. ఈ క్రమంలో ఓ రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియాపై వన్డే ద్వైపాక్షిక సిరీస్‍లో కెప్టెన్‍గా ఉంటూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బ్రూక్ చరిత్ర సృష్టించాడు.
(3 / 5)
ఈ ఐదు వన్డేల సిరీస్‍లో బ్రూక్ 312 పరుగులు చేశాడు. ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు బాదాడు. ఐదు మ్యాచ్‍ల్లో మొత్తంగా 30 ఫోర్లు, 13 సిక్స్‌లు కొట్టాడు.
(4 / 5)
ఆస్ట్రేలియాపై ద్వైపాక్షిక సిరీస్‍లో కెప్టెన్‍గా అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. 2019లో జరిగిన సిరీస్‍లో భారత సారథిగా ఉన్న కోహ్లీ 310 పరుగులు బాదాడు. ఇప్పుడు ఈ సిరీస్‍లో ఇంగ్లండ్ కెప్టెన్‍గా ఉన్న బ్రూక్ ఆస్ట్రేలియాపై సిరీస్‍లో 312 రన్స్ చేసి కోహ్లీ రికార్డును దాటేశాడు. ఆస్ట్రేలియాపై వన్డే ద్వైపాక్షిక సిరీస్‍లో అత్యధిక రన్స్ చేసిన కెప్టెన్‍గా నిలిచాడు.
ఇతర గ్యాలరీలు