(1 / 6)
విజయవాడను వరద ముంచెత్తుతుంది. కుమ్మరిపాలెం సెంటర్ దగ్గర హైవే పైకి వరద నీరు చేరింది. రోడ్లపై పడవలతో ప్రయాణంచేస్తున్నారు. లోతట్టు ప్రాంత వాసులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
(@pramodzk)(2 / 6)
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సీతారాం తండాలో.. వరద ధాటికి ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ఇబ్బందులు పడుతున్న దాదాపు 100 మంది తండా వాసులను ఎస్సై నగేష్, తన సిబ్బంది రాము, మహిపాల్‌లతో కలిసి జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
(@mhbdpolice)(3 / 6)
బుడమేరు దెబ్బకు విజయవాడ శివారు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 24 కాలనీలు, పలు గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విజయవాడలో ప్రాంతాల వారీగా ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. ఈ అధికారులు క్షేత్రస్థాయిలో బాధితులకు అందుబాటులో ఉండనున్నారు.
(@pramodzk)(4 / 6)
విజయవాడలోని పెద్దపులి పాకలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. 3 వ బెటాలియన్ ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
(@APPOLICE100)(5 / 6)
వరద పరిస్థితులపై చంద్రబాబును ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వపరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని సీఎంకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న వరద సహాయ చర్యలపై ప్రధానికి సీఎం వివరించారు.
(@APPOLICE100)(6 / 6)
వరదపోటుతో యనమలకుదురు నీట మునిగింది. ఇళ్లలోకి వరద నీరు చేరింది. వేల సంఖ్యలో నిర్వాసితులు ఉన్నారు. బోట్లలో నిర్వాసితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
(@pramodzk)ఇతర గ్యాలరీలు