ఓటీటీల్లోకి ఒకే రోజు రెండు తమిళ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..-emi and varunan ott streaming on same day on tentkotta and sun nxt otts ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఓటీటీల్లోకి ఒకే రోజు రెండు తమిళ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఓటీటీల్లోకి ఒకే రోజు రెండు తమిళ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Published Apr 28, 2025 10:49 PM IST Chatakonda Krishna Prakash
Published Apr 28, 2025 10:49 PM IST

రెండు తమిళ చిత్రాలు ఒకే రోజు (మే 1) ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు రానున్నాయి. ఒకటి ఫ్యామిలీ డ్రామా మూవీ కాగా.. మరొకటి యాక్షన్ చిత్రంగా ఉంది. అవేవంటే..

తమిళ సినిమా ‘ఈఎంఐ’ ఏప్రిల్ 4వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో సదాశివమ్ చిన్నరాజ్ ప్రధాన పాత్ర పోషించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రం పాజిటివ్ టాక్ దక్కించుకుంది.

(1 / 5)

ఈఎంఐ చిత్రం మే 1వ తేదీన టెంట్‍కొట్టా (Tentkotta) ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఆ ప్లాట్‍ఫామ్ నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోనూ అదే రోజున ఈ చిత్రం అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

(2 / 5)

లోన్లకు ఈఎంఐలు చెల్లించేందుకు మిడిల్ క్లాస్ జనాలు ఎలాంటి తిప్పలు పడతారు, ఎంత ఒత్తిడికి గురవుతారనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో సదాశివమ్‍తో పాటు సాయిధన్య, బ్లాక్‍పాండి, అధవన్, సెంథిల్ కుమారి కూడా కీలకపాత్రలు చేశారు.

(3 / 5)

వరుణన్ సినిమా మార్చి 14వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. దుష్యంత్ జయప్రకాశ్ ఈ మూవీలో లీడ్ రోల్ చేశారు. ఈ యాక్షన్ డ్రామా చిత్రానికి జయవేల్ మురుగన్ దర్శకత్వం వహించారు. నీటి వ్యాపారం చేసే రెండు గ్రూప్‍ల మధ్య ఈ చిత్రం సాగుతుంది.

(4 / 5)

వరుణన్ సినిమా మే 1వ తేదీన ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మూవీలో దుష్యంత్‍తో పాటు గాబ్రియెల్లా కార్ల్‌టన్, రాధారవి, చరణ్ రాజ్ కీరోల్స్ చేశారు.

(5 / 5)

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు