Home Minister Anitha : హోంమంత్రి అనితకు తృటిలో తప్పిన ప్రమాదం, ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టిన కారు
- Home Minister Anitha : ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో తనకేం కాలేదని మంత్రి అనిత తెలిపారు.

(1 / 5)
హోంమంత్రి వంగలపూడి అనితకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న వాహనం ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టింది.
(2 / 5)
హోంమంత్రి అనిత కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనానికి బైకు అడ్డురావడంతో ఒక్కసారిగా బ్రేక్ వేశారు. దీంతో అనిత ప్రయాణిస్తున్న కారు ఎస్కార్ వాహనాన్ని ఢీకొట్టింది.
(3 / 5)
ఈ ఘటనలో అనిత ప్రయాణిస్తున్న కారు స్వల్పంగా ధ్వంసమైంది. హోంమంత్రి వెంటనే మరో వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
(4 / 5)
విజయవాడ నుంచి పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం అల్లంపురం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఇతర గ్యాలరీలు